AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghani: మెగా అభిమానులకు బ్యాడ్‏న్యూస్.. బాబాయ్ సినిమా కోసం గని వెనకడుగు..

మెగా అభిమానులకు బ్యాడ్‏న్యూస్ చెప్పారు గని (Ghani) చిత్రయూనిట్.. మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా

Ghani: మెగా అభిమానులకు బ్యాడ్‏న్యూస్.. బాబాయ్ సినిమా కోసం గని వెనకడుగు..
Ghani
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2022 | 3:42 PM

Share

మెగా అభిమానులకు బ్యాడ్‏న్యూస్ చెప్పారు గని (Ghani) చిత్రయూనిట్.. మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి కాంబోలో వస్తున్న భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుండడంతో గని చిత్ర రిలీజ్ డేట్‏ను పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయాన్ని మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కష్ట సమయంలో మాకు బాసటగా నిలిచిన వారందరి ప్రేమకు ఎంతో సంతోషిస్తున్నాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ ఈనెల 25న రాబోతుంది. ఈ క్రమంలో మా సినిమా వాయిదా వేసుకున్నాం.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాము అంటూ ట్వీట్ చేశారు గని టీం.

ఇప్పటికే భీమ్ల నాయక్ సినిమా కోసం శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న సెబాస్టియన్ సినిమా కూడా మార్చి 4న విడుదల కానున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. బాక్సింగ్ నేపథ్యంలో తరెకెక్కుతున్న గని సినిమాను సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గని సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు తాజాగా విడుదలైన భీమ్లా నాయక్ ట్రైలర్ యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుని నెట్టింట్లో రచ్చ చేస్తుంది. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తోంది.

Also Read: Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రేపే భీమ్లా నాయక్‌ ప్రీ రిలిజ్‌ ఈవెంట్‌..

Pushpa Song: పుష్ప హ్యాంగోవర్‌ ఇప్పట్లో వదిలేలా లేదుగా.. వైరల్‌ అవుతోన్న రాఖీ సవంత్‌ డ్యాన్స్‌..

Bandla Ganesh: ఆ ఆడియోలో ఉంది నా వాయిస్‌ కాదు.. కొట్టి పారేసిన బండ్ల గణేష్‌..

RGV: భీమ్లా నాయక్‌పై సెటైర్లు.. పవన్‌ ఫ్యాన్స్‌ను మరోసారి కవ్వించిన రామ్‌గోపాల్‌ వర్మ..