Bandla Ganesh: ఆ ఆడియోలో ఉంది నా వాయిస్ కాదు.. కొట్టి పారేసిన బండ్ల గణేష్..
Bandla Ganesh: 'నన్ను భీమ్లా నాయక్ (Bheemla Nayak) ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాకుండా అడ్డుకుంటున్నారు. నాకు రావాలని ఉన్నా త్రివిక్రమ్ (Trivikram) రాకుండా చూస్తున్నారు. వైసీపీ నేతలతో కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు'. బండ్లగణేష్ ఓ అభిమానితో ఫోన్‌లో మాట్లాడరంటూ సోమవారం ఈ ఆడియో క్లిక్...
Bandla Ganesh: ‘నన్ను భీమ్లా నాయక్ (Bheemla Nayak) ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాకుండా అడ్డుకుంటున్నారు. నాకు రావాలని ఉన్నా త్రివిక్రమ్ (Trivikram) రాకుండా చూస్తున్నారు. వైసీపీ నేతలతో కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు’. బండ్లగణేష్ ఓ అభిమానితో ఫోన్‌లో మాట్లాడరంటూ సోమవారం ఈ ఆడియో క్లిక్ తెగ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఈవెంట్స్‌లో తనదైన శైలిలో మాట్లాడుతూ అభిమానుల్లో జోష్ నింపే బండ్లా గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న వార్తలు వైరల్‌గా మారాయి. ఆ ఆడియోలో త్రివిక్రమ్, వైసీపీ ప్రస్తావన రావడంతో కొత్త చర్చకు దారి తీసింది. ఎవరి ఊహాగానాలు వారు సృష్టించారు. అసలు బండ్ల గణేష్ విషయంలో ఏం జరుగుతుందన్న వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే వైరల్ అవుతోన్న ఆడియో క్లిప్‌పై బండ్ల గణేష్ నుంచి వివరణ కోసం టీవీ9 ప్రయత్నించింది. అయితే ఈ విషయమై గణేష్ స్పందిస్తూ.. నెట్టింట వైరల్ అవుతోన్న ఆడియో తనది కాదని కొట్టి పారేశారు. ఈ విషయంపై నేను స్పందించను అంటూ తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ బండ్ల గణేష్ మాట్లడకపోతే, ఈ ఆడియోను ఎవరు వైరల్ చేశారు.? అసలు బండ్ల గణేష్‌ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది.? అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అటు త్రివిక్రమ్ కూడా స్పందించలేదు. మరి బుధవారం జరగనున్న భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయం ఏమైనా ప్రస్తావనకు వస్తుందేమో చూడాలి.
Also Read: నమ్మండి.. మనుషుల్లో మంచితనం ఇంకా మిగిలే ఉంది.. దీనిని నిరూపించే ఘటన ఇది
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఈ సిలిండర్ ధర కేవలం రూ. 633 మాత్రమే..?
Hair Care Tips: తల బాగా దురద పెడుతోందా? అయితే అలోవెరాతో ఇలా ఉపశమనం పొందండి..