నమ్మండి.. మనుషుల్లో మంచితనం ఇంకా మిగిలే ఉంది.. దీనిని నిరూపించే ఘటన ఇది
ఏవైనా వస్తువులు దొరికితే.. వాటిని సొంతదారునికి ఇవ్వాలన్న ఆలోచన అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అదే అధిక మొత్తంలో డబ్బు, ఆభరణాలు లభిస్తే అవి పోగొట్టుకున్న వ్యక్తికి..
ఏవైనా వస్తువులు దొరికితే.. వాటిని సొంతదారునికి ఇవ్వాలన్న ఆలోచన అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అదే అధిక మొత్తంలో డబ్బు, ఆభరణాలు లభిస్తే అవి పోగొట్టుకున్న వ్యక్తికి చేరుతాయో, లేదో చెప్పలేని పరిస్థితి. వాటి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. అవి చేతికందేవరకు ఎదురు చూడక తప్పదు. తాజాగా విజయవాడలో ఓ రిటైర్ ఉద్యోగి.. నగదు బ్యాగును బైక్ పై ఉంచారు. సదరు బైక్ యజమాని ఆ బ్యాగును గుర్తించకుండా సంచితో సహా వెళ్లిపోయాడు. కొద్ది దూరం వెళ్లాక బ్యాగును గుర్తించి, సొంతదారుని వద్దకు చేర్చారు. పోలీసుల సమక్షంలో బ్యాగు అప్పగించారు. నిజాయతీగా నగదు వెనక్కి తీసుకు వచ్చిన నర్సింహారావును తపాలశాఖ అధికారులు, సిబ్బంది, పోలీసులు అభినందించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన చదల అమరేశ్వరరావు.. తపాలా శాఖలో విధులు నిర్వహించి, రిటైర్ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం గవర్నర్‌పేట బకింగ్‌హాంపేట తపాలా కార్యాలయంలోని తన ఖాతా నుంచి రూ.5లక్షలు తీసుకున్నాడు. డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో నగదు బ్యాగును పక్కనే ఉన్న బైక్ పై పెట్టి ఫోన్ లో మాట్లాడారు. అమరేశ్వరరావు ఫోన్ లో మాట్లాడుతుండగా.. బైక్ యజమాని వాహనాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత చూసిన అమరేశ్వరరావు ద్విచక్రవాహనం కనిపించకపోవటంతో ఆందోళనకు గురయ్యారు. ఘటనపై గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు.. నగదు ఉన్న బ్యాగును తీసుకుని వెళ్లిపోయిన ద్విచక్ర వాహన చోదకుడు నర్సింహారావు కూడా తపాలా శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బ్యాగు ఉండటాన్ని గమనించారు. అందులో నగదు ఉండటంతో అధికారులకు విషయం తెలిపారు. ఈ సమయంలో గవర్నర్‌పేట పోలీసులు, అమరేశ్వరరావు తపాలా కార్యాలయానికి వచ్చారు. నగదు బ్యాగు అమరేశ్వరరావుదిగా గుర్తించి, పోలీసుల సమక్షంలో బ్యాగు అప్పగించారు. నిజాయతీగా నగదు వెనక్కి తీసుకువచ్చిన నర్సింహారావును తపాలశాఖ అధికారులు, సిబ్బంది, పోలీసులు అభినందించారు.
సాగర్, టీవీ9 రిపోర్టర్, విజయవాడ
Also Read
యానిమల్ ప్లానెట్ ప్రతినిధిపై మొసలి దాడి.. ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన.. వీడియో
Hair Care Tips: తల బాగా దురద పెడుతోందా? అయితే అలోవెరాతో ఇలా ఉపశమనం పొందండి..
News Watch: ఆ రెండు సంఘటనలు చాలు గౌతమ్ రెడ్డి ‘లీడర్’ అని చెప్పడానికి.. వీడియో