Goutham Reddy: ఎక్స్‌పోలో కాసేపు యాక్టివ్, కాసేపు నెమ్మదిగా.. దుబాయ్ టూర్‌లో గౌతమ్‌రెడ్డికి గుండె వార్నింగ్ ఇచ్చిందా..?
Viral Video: దుబాయ్ టూర్‌లోనే ఉండగానే గౌతమ్‌రెడ్డి ప్రవర్తించిన తీరు చూస్తుంటే.. ఆయన గుండె ఆరోజునే ఓ చిన్న వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపించింది.
AP Minster Goutham Reddy Last Speech: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర మంత్రి యంగ్ డైనమిక్ లీడర్ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. దుబాయ్(Dubai) పర్యటనలో ఉండగానే మేకపాటి గౌతమ్‌రెడ్డికి.. గుండె వార్నింగ్ ఇచ్చిందా? ఒక వీడియో ఇప్పుడు అలాంటి అనుమానాలనే రేకెత్తిస్తోంది. దుబాయ్ ఎక్స్‌పో(Dubai Expo)లో ఉన్న మేకపాటి చాలా యాక్టివ్‌గా కనిపించారు. కానీ ఓ సందర్భంలో చాతీని పట్టుకుంటూ కనిపించారు. వాస్తవానికి ఇందులో ఏముందీ అనుకోవచ్చు. కానీ ఒకటికి రెండుసార్లు ఆయన ఇదే ఇబ్బందిపడినట్లు కనిపించింది. అప్పటివరకూ యాక్టివ్‌గా దూసుకుపోయిన ఆయన ఆ తర్వాత మాత్రం కాస్త నెమ్మదించారు. అటూ ఇటూ చూస్తూ కాస్త ఇబ్బందిగానే కనిపించారు. కుడిచెయ్యిని చాతీపై పెట్టి ఒకటికి రెండుసార్లు సవరతీసుకున్నారు.
ఈ నెల 11న మంత్రి గౌతమ్ రెడ్డి దుబాయ్ వెళ్లారు. వారం రోజుల పాటూ దుబాయ్‌లో పర్యటించారు.. అక్కడ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తున్నామని, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ.. దుబాయ్ ఎక్స్‌పోలో 12 థీమ్‌లతో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ప్రారంభించారు. దుబాయ్ ఎక్స్ పోలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులతో వరుసగా సమావేశం అయ్యారు. టెక్ మార్క్ కంపెనీ, అలానా గ్రూప్ , ఐబీపీసీ, ఎన్ వెంట్, కూ,రెగల్ ట్రేడర్స్,నికయ్ గ్రూప్,ఈఎస్పీఏ కంపెనీల ఛైర్మన్, ఎండీలు, ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించి చర్చించారు. అలాగే దుబాయ్ పర్యటనలో మూడు ఎంవోయూలను కుదుర్చుకున్నారు. లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఒప్పందం, రీటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ నేమ్ తో 25 సంవత్సరాలుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్ తో జీ2బీ(గవర్నమెంట్ టు బిజినెస్) ఒప్పందం, రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు రీజెన్సీ గ్రూప్ ఎంవోయూ కుదుర్చుకుంది. అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో మరో కీలక ఒప్పందం చేసుకున్నారు. తిరిగి 20వ తెల్లవారుఝామున హైదరాబాద్ తిరిగొచ్చారు. సాధారణంగా ఆయనకు ఉదయాన్నే జిమ్‌కి వెళ్లే అలవాటు. కానీ జర్నీ చేసి లేట్ నైట్ రావడంతో 20వ తేదీ జిమ్‌కు వెళ్లలేదు. కానీ ఆ రోజు సాయంత్రం గచ్చిబౌలిలోని ఓ నిశ్చితార్థకార్యక్రానికి హాజరయ్యారు. మర్నాడు… అంటే నిన్న 21న తేదీ తెల్లవారుఝామున గుండెపోటుతో చనిపోయారు.
దుబాయ్ టూర్‌లోనే ఉండగానే గౌతమ్‌రెడ్డి ప్రవర్తించిన తీరు చూస్తుంటే.. ఆయన గుండె ఆరోజునే ఓ చిన్న వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపించింది. సహజంగానే అందరం గ్యాస్ట్రిక్ అనో, ఇంకేదో చిన్న సమస్యగానో భావించి లైట్ తీసుకుంటాం. ఇక్కడ గౌతమ్‌రెడ్డి విషయంలోనూ అదే జరిగినట్లు కనిపించింది గానీ.. దాని ఎఫెక్ట్ మరో రెండురోజుల తర్వాత కనిపించింది. అదే గుండె లయతప్పి పూర్తిగా ఆగిపోయింది. ఆయన మంత్రి హోదాలో దుబాయ్‌లో మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. పెట్టుబడుల కోసం దుబాయ్ వెళ్లిన మంత్రి.. తిరిగి ఏపీకి వెళ్లకుండానే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.
సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డి అనారోగ్యానికి గురికావడంతో హుటా హుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు అత్యవసరంగా వైద్యం అందించారు.. అక్కడ చికిత్సపొందుతూ కన్నుమూశారు. మంత్రి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Read Also….