యానిమల్ ప్లానెట్ ప్రతినిధిపై మొసలి దాడి.. ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన.. వీడియో
ఒకప్పుడు మొసళ్లను ప్రేమగా చూసుకున్న రాబర్ట్ ఇర్విన్ గుర్తున్నారుగా... ఆయన కొడుకైన స్టీవ్ ఇర్విన్ ఆస్ట్రేలియాలో టీవీ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తూ తాజాగా మొసలి దాడి నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు.
ఒకప్పుడు మొసళ్లను ప్రేమగా చూసుకున్న రాబర్ట్ ఇర్విన్ గుర్తున్నారుగా… ఆయన కొడుకైన స్టీవ్ ఇర్విన్ ఆస్ట్రేలియాలో టీవీ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తూ తాజాగా మొసలి దాడి నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు. యానిమల్ ప్లానెట్ లో క్రికీ అనే ఎపిసోడ్ చేస్తూ… ఈ 18 ఏళ్ల కుర్రాడు ఆస్ట్రేలియాలో జూలో 350 కేజీల కాస్పెర్ అనే మొసలికి ఆహారం వెయ్యబోయాడు. అది కొత్త ఎన్‌క్లోజర్ కావడంతో ఆ మొసలికి ఆ ప్రాంతం వెంటనే నచ్చలేదు. అందువల్ల అది కోపంగా ఉంది. స్టీవ్ వేసిన ఆహారాన్ని తినకుండా అది అతనిపై దాడికి ప్రయత్నించింది. దాంతో అతను అక్కడి నుంచి పరుగుతీశాడు. ఈ ఛేజింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలు
Latest Videos