Hair Care Tips: తల బాగా దురద పెడుతోందా? అయితే అలోవెరాతో ఇలా ఉపశమనం పొందండి..
Beauty Tips: వాతావరణంలోని అనూహ్య మార్పులు చర్మంతో పాటు జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. సీజనల్ ఛేంజెస్ వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడంతో చర్మం తో పాటు వెంట్రుకలు పొడిగా మారుతాయి.
Beauty Tips: వాతావరణంలోని అనూహ్య మార్పులు చర్మంతో పాటు జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. సీజనల్ ఛేంజెస్ వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడంతో చర్మం తో పాటు వెంట్రుకలు పొడిగా మారుతాయి. చుండ్రు బాగా ఇబ్బంది పెడుతుంది. క్రమంగా ఇది హెయిర్ ఫాల్ (Hair Fall) కు దారి తీస్తుంది. ఎప్పుడైతై మొండి చుండ్రు ప్రారంభమైతుందో తలంతా దురద (Etching) పెడుతుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్లో ఎన్నో సౌందర్య ఉత్పత్తులున్నా వాటిలోని రసాయనాలు జుట్టుపై దుష్ర్పభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇందుకోసం సహజ చిట్కాలనే ఉపయోగించడం మేలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కలబందతో తల దురదతో పాటు పలు జుట్టు సమస్యలను తొలగించుకోవచ్చు. పైగా ఇది చర్మ సంరక్షణకు కూడా తోడ్పడుతుంది. మరి కలబందను ఉపయోగించి జుట్టు సమస్యలను ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం రండి.
సీరంగా..
జుట్టును తేమగా ఉంచడంలో సీరం బాగా సహాయపడుతుంది. అయితే అది సహజ పదార్థాలతో చేసుకుంటే మరీ మంచిది. అలోవెరా సీరమ్ తయారుచేయాలంటే అలోవెరా జెల్‌తో పాటు కొబ్బరి నూనె, రోజ్ వాటర్ విటమిన్ ఇ ఆయిల్ అవసరం. ఈ పదార్థాలన్నింటినీ సరైన పరిమాణంలో మిక్స్ చేసి కొద్ది సేపు ఉంచాలి. ఆతర్వాత మిశ్రమాన్ని చేతులతో జుట్టుకు బాగా పట్టించాలి. కావాలంటే ఈ సీరాన్ని హెయిర్ బ్రష్ సహాయంతో కూడా వెంట్రుకల కుదుళ్లకు అప్లై చేసుకోవచ్చు. స్నానానికి ముందు ఈ సీరమ్ అప్లై చేయడం మంచిది. అలాగే, సీరం రాసుకున్న తర్వాత పరిశుభ్రమైన నీటితో మాత్రమే కడుక్కోవాలి.
వేపతో మిక్స్ చేసి..
కలబందతో పాటు, వేపలో ఇటువంటి అనేక సహజ లక్షణాలు ఉన్నాయి, ఇవి తలలో దురదను తగ్గించడంలో బాగా తోడ్పడుతాయి. ఇందుకోసం కలబంద, వేపను కలిపి హెయిర్ మాస్క్ ను సిద్ధం చేసుకోవచ్చు. ఇందుకోసం అలోవెరా జెల్‌లో కొద్దిగా వేపాకుల పేస్ట్‌ను కలపండి. ఈ పేస్ట్‌ను తలకు బాగా పట్టించాలి. వేపలోని ఔషధ గుణాలు తలలోని దురదను తగ్గిస్తాయి. వారంలో కనీసం ఒక్కసారైనా ఈ మాస్క్‌ను అప్లై చేస్తే మంచి ఫలితముంటుంది.
తులసి ఆకులతో కలిపి..
తులసి ఆకులు ఆరోగ్యానికే కాదు చర్మం, జుట్టు సంరక్షణకు కూడా ఎంతో మంచివి. ఇందుకోసం 10 నుండి 12 తులసి ఆకులను నీటి సహాయంతో బాగా గ్రైండ్ చేసి, అందులో అలోవెరా జెల్ మిక్స్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించాలి. దీంతో స్కాల్ప్ దురద పోతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చుండ్రు వల్ల కోల్పోయిన మెరుపు తిరిగి సొంతమవుతుంది. కలబంద, తులసితో తయారు చేసిన ఈ మాస్క్‌ని వారంలో రెండు సార్లు జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Also Read:Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..
Ottawa: కెనడా రాజధాని ఒట్టావాలో ఆందోళనలు ఉధృతం.. నిరసనకారులపై లాఠీచార్జ్..
Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం..