AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: “ఐ వాన రీ ప్రొడ్యూస్ యూ”.. నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉంది. వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీగా ఉంటుంది.

Samantha: ఐ వాన రీ ప్రొడ్యూస్ యూ.. నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సమంత..
Sam
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2022 | 3:25 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉంది. వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీగా ఉంటుంది. విడాకుల అనంతరం సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ.. ఫాలోవర్లతో టచ్‏లో ఉంటుంది. ప్రస్తుతం సామ్.. యశోద సినిమా షూటింగ్‏లో పాల్గోంటుంది. ఇదే కాకుండా.. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో సమంత మునుపెన్నడు కనిపించనంత అందంగా కనిపిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి..

ఇదిలా ఉంటే.. తాజాగా సమంత తన ఇన్ స్టా అకౌంట్ పేజీలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించింది. అందులో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పింది. అందులో మీ పనులు చేయడానికి ఇంత ధైర్యం ఎలా వస్తుంది అని యూజర్ అడగ్గా.. అతి పెద్ద కష్టాలను ఎదుర్కొన్నప్పుడే గొప్ప ధైర్యం వస్తుంది అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే మీ ప్రతిరూపానికి పురుడు పోశారా ? ఎందుకంటే మీ వంటి వారిని మరొకరిని తయారుచేయాలనుకుంటున్నాను (ఐ వాన రీ ప్రొడ్యూస్ యూ) అంటూ కామెంట్ చేశాడు. ఈ ప్రశ్నకు సమంత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ఇంతకూ రీ ప్రొడ్యూస్ ను ఒక వ్యాక్యంలో ఎలా ఉపయోగిస్తారు ? దానిని ముందుగా గూగుల్ చేసి చూడాలా ? అంటూ కౌంటరిచ్చింది.

Samantha

Samantha

మరో యూజర్ యంగ్ జనరేషన్ కోసం మీరు ఇచ్చే సలహా ఏంటీ అని అడగ్గా విరామం తీసుకోండి.. డోంట్ బర్న్ అవుట్ అంటూ బదులిచ్చింది. మీరు భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉందా అని అడగ్గా.. నేను చాలా ఆలస్యంగా నేర్చుకుంది ఏంటంటే.. ఎప్పుడూ ఏది చెప్పకూడదు అని. చివరి లక్ష్యం ఏంటీ అని అడగ్గా.. గుర్తుపెట్టుకోవడం అంటూ బదులిచ్చింది. ఇలా సమంత నెటిజన్స్ ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు చెప్పింది.

Also Read: Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రేపే భీమ్లా నాయక్‌ ప్రీ రిలిజ్‌ ఈవెంట్‌..

Pushpa Song: పుష్ప హ్యాంగోవర్‌ ఇప్పట్లో వదిలేలా లేదుగా.. వైరల్‌ అవుతోన్న రాఖీ సవంత్‌ డ్యాన్స్‌..

Bandla Ganesh: ఆ ఆడియోలో ఉంది నా వాయిస్‌ కాదు.. కొట్టి పారేసిన బండ్ల గణేష్‌..

RGV: భీమ్లా నాయక్‌పై సెటైర్లు.. పవన్‌ ఫ్యాన్స్‌ను మరోసారి కవ్వించిన రామ్‌గోపాల్‌ వర్మ..