Balakrishna, Mahesh Babu: బాలయ్యతో కలిసి మరోసారి సందడి చేయనున్న మహేష్ బాబు..?
హీరోగా బాలయ్య ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందుకున్నారు. ఇక బాలయ్య ఇప్పుడు హోస్ట్ గాను వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నటసింహం అన్ స్టాపబుల్ అనే సినిమా టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా ,రికార్డ్ క్రియేట్ చేసింది.
![Balakrishna, Mahesh Babu: బాలయ్యతో కలిసి మరోసారి సందడి చేయనున్న మహేష్ బాబు..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/12/balakrishna-mahesh-babu.jpg?w=1280)
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి మేపించారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులకు పూనకాలే. హీరోగా బాలయ్య ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందుకున్నారు. ఇక బాలయ్య ఇప్పుడు హోస్ట్ గాను వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నటసింహం అన్ స్టాపబుల్ అనే సినిమా టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా ,రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఇప్పటివరకు రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ . ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ తో సీజన్ 3లోకి అడుగుపెట్టింది.
సీజన్ 3 లో ఇప్పటికే బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి టీమ్ హాజరయ్యింది. ఆతర్వాత యానిమల్ టీమ్ హాజరయ్యారు.బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. హీరోయిన్ రష్మిక మందన్న, అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హాజరై సందడి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ గెస్ట్ పై ఇంట్రస్టింగ్ టాక్ నడుస్తుంది. ఇప్పుడు మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు అన్ స్టాపబుల్ షోలో సందడి చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.
గతంలో మహేష్ బాబు అన్ స్టాపబుల్ షోకు హాజరయిన విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ఫినాలేకు మహేష్ బాబు గెస్ట్ గా హాజరయ్యారు. మహేష్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు బాలయ్యతో కలిసి సందడి చేయనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ అన్ స్టాపబుల్ కు హాజరు కానున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.