AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka and Trisha: సీనియర్ హీరోయిన్స్ ఈసారైనా బౌన్స్ బ్యాక్ అవుతారా..?

టాప్‌ నలుగురు హీరోలే కాదు... యంగ్‌ హీరోస్‌తోనూ జోడీ కట్టారు అనుష్క అండ్‌ త్రిష. స్టోరీ ఎలా ఉన్నా, కేరక్టర్‌ ఎంత ఛాలెంజింగ్‌గా ఉన్నా వీరిద్దరూ సై అంటూ దూకారే తప్ప, నీరసపడ్డ దాఖలాలు లేవు.

Anushka and Trisha: సీనియర్ హీరోయిన్స్ ఈసారైనా బౌన్స్ బ్యాక్ అవుతారా..?
Anushka And Trisha
Rajeev Rayala
|

Updated on: May 11, 2022 | 9:02 PM

Share

టాప్‌ నలుగురు హీరోలే కాదు.. యంగ్‌ హీరోస్‌తోనూ జోడీ కట్టారు అనుష్క(Anushka) అండ్‌ త్రిష(Trisha). స్టోరీ ఎలా ఉన్నా, కేరక్టర్‌ ఎంత ఛాలెంజింగ్‌గా ఉన్నా వీరిద్దరూ సై అంటూ దూకారే తప్ప, నీరసపడ్డ దాఖలాలు లేవు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ బ్యూటీస్ కి ఈ గ్యాప్‌ ఎందుకొచ్చింది. అనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. సూపర్‌భామ సాషాగా ఫస్ట్ మూవీతోనే సూపర్‌ సక్సెస్‌ అయ్యారు అనుష్క. ఆ తర్వాత వరుసబెట్టి కమర్షియల్‌ మూవీస్‌కి సైన్‌ చేసి విజయాలు సొంతం చేసుకుని, టాప్‌ చెయిర్‌లో కూర్చున్నారు. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర ఓ రేంజ్‌ సౌండ్‌ చేశాయంటే, అనుష్కకున్న చరిష్మా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అదంతా నిన్నటి మాట. కానీ ఇప్పుడు… అనుష్క ఎక్కడున్నారు? అని ఆరా తీయాల్సిన పరిస్థితి. సైజ్‌ జీరో కోసం స్వీటీ కాన్ఫిడెంట్‌గా చేసిన ప్రయత్నం కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత బాహుబలి రెండు పార్టులు చేసినా, నమో వేంకటేశాయ చేసినా.. ఆ టైమ్‌లో బరువు విషయంలో బాధపడుతూనే ఉన్నారు స్వీటీ. నిశ్శబ్దం షూటింగ్‌ టైమ్‌లో అనుష్క తీవ్రమైన నడుము నొప్పితో ఇబ్బందిపడ్డారనే వార్తలొచ్చాయి. అందుకే కాస్త గ్యాప్‌ తీసుకోవాలనుకున్నారు.

సరిగ్గా ఆ టైమ్‌లోనే కరోనా విజృంభించడంతో అనుష్క కోరుకున్నదే జరిగింది. కాకపోతే జనాలు మాత్రం అనుష్క ఫేడ్‌ అవుట్‌ అయిపోయారా? ఆమెకు అవకాశాలు రావట్లేదా? నవీన్‌ పోలిశెట్టితో యువీ క్రియేషన్స్ చేస్తున్న సినిమా తప్ప, ఆమె చేతిలో మరిన్ని ప్రాజెక్టులు ఎందుకు లేవు? అని చర్చించుకుంటున్నారు. సాలిడ్‌ హిట్‌తో సమాధానం చెప్పడం తప్ప, స్వీటీ కూడా చేసేదేమీ లేదంతే.. ఇక త్రిష విషయానికొస్తే.. వర్షం, కింగ్‌, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అతడు, పౌర్ణమి, బుజ్జిగాడు.. ఇలా త్రిష కెరీర్లో ఠకీమని చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ రీసెంట్‌ టైమ్స్ లో సాలిడ్‌ హిట్‌ ఏంటంటే.? సమాధానం లేదు. ఆ మధ్య తమిళ్‌లో వచ్చిన 96 తప్పితే అక్కడా హిట్‌ సినిమాలు లేవు. ఓన్‌ మార్కెట్‌ క్రియేట్‌ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసిన విమెన్‌ ఓరియంటెడ్‌ సబ్జెక్టులు దెబ్బతీశాయా? స్టోరీల సెలక్షన్‌లో తప్పు జరిగిందా? అని సెల్ప్‌ చెక్‌ చేసుకున్నారు త్రిష.

ఒక్కసారి నిలిచి నిదానంగా ఆలోచిస్తే ఎంత టఫ్‌ క్వశ్చన్‌కైనా ఆన్సర్‌ ష్యూర్‌గా వస్తుందన్నది త్రిష సిద్ధాంతం. అందుకే థింక్‌ చేశారు. మళ్లీ పాత రోజులు కావాలనుకున్నారు. ఫుల్‌ ఫోకస్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ మీద పెట్టారు. మణిరత్నం డైరక్ట్ చేస్తున్న పొన్నియిన్‌ సెల్వన్‌ రెండు పార్టుల్లోనూ త్రిష కేరక్టర్‌ ని మణి గ్రాండ్‌గా ఎలివేట్‌ చేశారనే టాక్‌ ఉంది. దీన్నిబట్టి ఈ మూవీ త్రిషకు బౌన్స్ బ్యాక్‌ అవుతుందని అంటున్నారు త్రిషా ఫ్యాన్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..