SSMB 29: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! రాజమౌళి సినిమా నుంచి గ్లింప్స్ వచ్చేది ఆ రోజే

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్వకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

SSMB 29: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! రాజమౌళి సినిమా నుంచి గ్లింప్స్ వచ్చేది ఆ రోజే
Mahesh Babu

Updated on: Jul 18, 2025 | 9:05 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. చివరిగా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దాంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళి సినిమా పై ఆశలు పెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి : రిలీజై 7ఏళ్ళైనా ఓటీటీని ఊపేస్తున్న సినిమా.. చూస్తే సుస్సూ పోసుకోవాల్సిందే

అలాగే తన లుక్, మేకోవర్ పూర్తిగా మార్చేశారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా మహేష్ బాబు అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. మహేష్ రాజమౌళి సినిమా నుంచి గ్లింప్స్ రానుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మరికొన్ని రోజుల్లో మహేష్ బాబు పుట్టిన రోజు.. మహేష్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ అంతా సిద్ధం అవుతున్నారు. సోషల్ మీడియాను షేక్ చేయడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బర్త్ డే రోజు రాజమౌళి సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఎస్ఎస్ఎంబీ 29 సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది. కీలక సీన్స్‌ను మరింత మాడిఫై చేయడంలో బిజీగా ఉన్నారట.. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే ..

ఇది కూడా చదవండి : స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ.. ఒక్క యాక్సిడెంట్‌తో అంతా రివర్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.