Shilpa Shetty Role In Mahesh: మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అతడు, ఖలేజా.. తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు త్రివిక్రమ్. ఇందులో భాగంగా మంచి కథనంతో పాటు నటీనటులు ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన బయటకు వస్తోన్న ఒక్కో వార్త సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. శిల్పా గతంలో తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం విధితమే. ఇక మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో శిల్పా పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై భారీగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో శిల్పాశెట్టి మహేశ్ బాబుకు అత్తగా నటించనున్నట్లు తెలుస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్రను పోలి ఉంటుందని చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక శిల్పా అత్త పాత్రలో నటించడానకి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. మహేశ్ ప్రసుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.
Also Read: PF ఖాతాదారులకు శుభవార్త.. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతి నెల అకౌంట్లోకి డబ్బులు..