NTR : ఎన్టీఆర్‌కు జోడీగా క్రేజీ బ్యూటీ.. దాదాపు ఫిక్స్ అంటున్నారే

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి పార్ట్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

NTR : ఎన్టీఆర్‌కు జోడీగా క్రేజీ బ్యూటీ.. దాదాపు ఫిక్స్ అంటున్నారే
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 31, 2024 | 12:37 PM

ఎన్టీఆర్  రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే..  కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి పార్ట్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి సినిమా చేస్తున్నాడు తారక్.

వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వలోనూ ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం తారక్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు.విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా చేశారు ప్రశాంత్. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు సలార్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలాగే కేజీఎఫ్ 3 కూడా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు ప్రశాంత్. అయితే తారక్ సినిమా కు సంబంధించి నిత్యం ఎదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గురించి కూడా ఓ వార్త షికారు చేస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారని టాక్ వినిపించింది. ఇదే ప్రశ్న అమ్మడి ముందు ఉంచితే సైలెంట్ ఉండిపోయింది. దాంతో ఈ అమ్మడు హీరోయిన్ గా ఫిక్స్ అని అంటున్నారు కొందరు. ఎన్టీఆర్-నీల్ మూవీలో రుక్మిణి వాసంత్ నిజంగానే నటిస్తుందా.. లేక వినిపిస్తున్న వార్తలన్నీ కూడా కేవలం పుకార్లేనా.. అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.