
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్నాళ్లు తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించిన దేవీ శ్రీ ప్రసాద్.. ఇప్పుడు హీరోగా అదరగొట్టనున్నాడు. బలగం సినిమాతో తానేంటో నిరూపించుకున్న కమెడియన్ వేణు ఇప్పుడు ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు. బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ముఖ్యంగా ఈ సినిమాలోని కథ ప్రతిఒక్కరికి కనెక్ట్ అయ్యింది. దాంతో ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు దర్శకుడు వేణు.
ఎల్లమ్మ సినిమాకు మొదటి నుంచి హీరో కష్టాలు తప్పడం లేదు.. ఈ సినిమాకు ముందుకు నేచురల్ స్టార్ నానిని హీరోగా అనుకున్నారు. కానీ ఆ తర్వాత నాని ప్లేస్ లోకి నితిన్ వచ్చాడు. నితిన్ తో ఈ సినిమా పట్టాలెక్కుతోందని వార్తలు వచ్చాయి. నితిన్ తో ఆల్ మోస్ట్ ఈ సినిమా తెరకెక్కుతోందని అంతా అనుకున్నారు కానీ .. నితిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. ఆతర్వాత బెల్లం కొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపించింది. పోనీలే ఇప్పటికైనా హీరో దొరికాడు అనుకునే లోగా అతను కూడా ఈ సినిమాలో నటించడం లేదని తెలిసింది.
ఇక ఈ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారు అని అందరూ ఎదురుచూస్తుండగా ఊహించని విధంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. ఇక ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దేవికి జోడిగా నటించే హీరోయిన్ గురించి టాక్ వినిపిస్తుంది. దేవి శ్రీకి హీరోయిన్ గా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎల్లమ్మ సినిమాకు ఎప్పటి నుంచో కీర్తి పేరు వినిపిస్తూనే ఉంది . అయితే ఇప్పుడు హీరో మారాడు కాబట్టి హీరోయిన్ కూడా మారుతుందా అని అందరూ అనుకుంటున్నారు.. కానీ కీర్తినే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుంది కీర్తిసురేష్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.