AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Producer SKN:మరోసారి గొప్ప మనసు చాటుకున్న ‘బేబీ’ నిర్మాత.. ఆ హీరో అభిమానికి అండగా నిలిచిన ఎస్కేఎన్

బేబీ సినిమాతో టాలీవుడ్ లో మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా నిర్మాణంలో బిజీ బిజీగా ఉన్న ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఓ అభిమాని కుటుంబానికి..

Producer SKN:మరోసారి గొప్ప మనసు చాటుకున్న 'బేబీ' నిర్మాత.. ఆ హీరో అభిమానికి అండగా నిలిచిన ఎస్కేఎన్
Tollywood Producer SKN
Basha Shek
|

Updated on: Oct 18, 2025 | 7:35 AM

Share

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ తో పాటు పలు సినిమాలను నిర్మించే పనుల్లో బిజీగా ఉంటున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే తన ఉపన్యాసాలు, కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ఎస్కేఎన్. ఒక్కోసారి ట్రోలింగ్, విమర్శలు కూడ ఎదుర్కొంటుంటారు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఎస్కేఎన్ ను మెచ్చుకోవచ్చు. కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదన్న మాటను నిజం చేస్తూ గుప్త దానాలు చేస్తుంటారు ఎస్కేఎన్. కష్టాల్లో ఉన్న ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారీ నిర్మాత. ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు వెంటనే రెస్పాండ్ అవుతారు ఎస్కేఎన్. అన్ని విషయాలు కనుక్కుని మరీ సాయం చేస్తారు. తాజాగా మరోసారి గొప్ప మనసు చాటుకున్నారీ నిర్మాత.

ఇటీవల మహేష్ బాబు వీరాభిమాని రాజేష్ అనే వ్యక్తి మరణించాడు. దీంతో ఆయన స్నేహితులు రాజేష్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజేష్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, దాతలు తన కుటుంబాన్న ఆదుకోవాలని బ్యాంక్ కు సబంధించిన వివరాలను షేర్ చేశారు. ఈ పోస్ట్ కాస్త ఎస్కేఎన్ దృష్టి కూడా వెళ్లడంతో వెంటనే ఆయన స్పందించారు.

ఇవి కూడా చదవండి

‘ఒక హీరో అభిమానిగా నేను మరొక అభిమాని భావోద్వేగాలను, ఉద్వేగాలను అర్థం చేసుకోగలను. ఈ విషయం నన్ను చాలా బాధ కలిగించింది. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యం అయితే ఈ ఘటన కారణంగా మరణించిన వ్యక్తి పిల్లల చదువులు ఆగిపోకూడదు. ఆ కుటుంబానికి నా వంతుగా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను. త్వరలోనే ఇందుకు సంబంధించి అన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను. రాజేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు మరికొందరు ముందుకు రావాలి’ అని కోరారు ఎస్కేఎన్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నిర్మాత ఎస్కేఎన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

నిర్మాత ఎస్కేఎన్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లైట్స్ ఆన్.. కెమెరా, యాక్షన్.. రాజధాని పిలుస్తోంది రా.. కదలిరా!
లైట్స్ ఆన్.. కెమెరా, యాక్షన్.. రాజధాని పిలుస్తోంది రా.. కదలిరా!
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లోకే..!
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లోకే..!
శుక్రవారం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇవి తప్పక చేయండి.. కానీ..
శుక్రవారం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇవి తప్పక చేయండి.. కానీ..
విదేశాలకు వెళ్లేవారికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..
విదేశాలకు వెళ్లేవారికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..
ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి..!
ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి..!
శరీరానికి ఫిల్టర్.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
శరీరానికి ఫిల్టర్.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
నిద్రపోయే ముందు ఆ ఒక్క తప్పు మీ గుండెకు శత్రువు..
నిద్రపోయే ముందు ఆ ఒక్క తప్పు మీ గుండెకు శత్రువు..
ప్రపంచవ్యాప్తంగా గడ్డిమందుపై పోరాటం.. ముందే నిలిచిన తెలంగాణ!
ప్రపంచవ్యాప్తంగా గడ్డిమందుపై పోరాటం.. ముందే నిలిచిన తెలంగాణ!
కోడి శరీరంలోని ఆ ఒక్క పార్ట్ తింటే బరువు తగ్గడం యమా ఈజీ
కోడి శరీరంలోని ఆ ఒక్క పార్ట్ తింటే బరువు తగ్గడం యమా ఈజీ
లక్కీ స్టార్ ఉన్న 3 రాశులు.. విజయం, డబ్బు వీరిని వెతుక్కుంటూ..
లక్కీ స్టార్ ఉన్న 3 రాశులు.. విజయం, డబ్బు వీరిని వెతుక్కుంటూ..