
భాగ్యశ్రీ బోర్సే చేసింది తక్కువ సినిమాలే అయినా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒక ఒక్క సినిమా చేసింది భాగ్యశ్రీ భోర్సే అది కూడా అట్టర్ ఫ్లాప్. మాస్ మాహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ భోర్సే మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ అందానికి కుర్రాళ్ళు ఫిదా ఆయ్యారు. అలాగే నటన పరంగాను ఈ చిన్నది మంచి మార్కులు కొట్టేసింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ చిన్నదని క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది.
ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే భాగ్యశ్రీ బోర్సే లుక్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.
స్టార్ హీరో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైనర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ వార్త నిజమైతే భాగ్యశ్రీ బోర్సే క్రేజ్ పెరిగినట్టే.. తక్కువ సమయంలోనే భాగ్యశ్రీ బోర్సే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ఈ సినిమాలు హిట్ అయితే భాగ్యశ్రీ బోర్సే తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి