Mahesh Babu: మహేష్-రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరో.. సూపర్ స్టార్‌కు తండ్రిగా నటించేది ఎవరంటే..
మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తుండిపోయాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో ఈ సినిమా 28వ మూవీ. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తుండిపోయాయి. దాంతో ఇప్పుడు మహేష్ 28వ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్ లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. దాంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా ఆ షూటింగ్ ను జనవరి నుంచి నాన్ స్టాప్ గా జరపనున్నామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఇక మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికి కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. ‘ఇండియానా జోన్స్’ తరహాలో హారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నామని ఇలాంటి సినిమాని చేయాలని రాజమౌళి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కోడుతోంది.
ఈ సినిమాలో మహేష్ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను అనుకుంటున్నారట . అమితాబ్ అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ గా సూట్ అవుతాడని జక్కన్న అనుకుంటున్నారట. అలాగే హీరోయిన్ గా కూడా ఒక బాలీవుడ్ భామను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయనున్నారు. కాబట్టే ఇలా స్టార్ కాస్డ్ ను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది.మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.