Jacqueline Fernandez vs Nora Fatehi : నారీ నారీ నడుమ సల్మాన్ భాయ్.. ముదురుతున్న మనీలాండరింగ్ వ్యవహారం

Jacqueline Fernandez vs Nora Fatehi : నారీ నారీ నడుమ సల్మాన్ భాయ్.. ముదురుతున్న మనీలాండరింగ్ వ్యవహారం

Rajeev Rayala

|

Updated on: Dec 14, 2022 | 6:15 AM

వీరిద్దరి మధ్య తీవ్ర గొడవ రగిలేలా చేస్తూనే.. మధ్యలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ మెడకు చుట్టుకునే వరకు వెళ్లింది.ఇక ఈ ఇయర్ బిగినింగ్‌ లోనే... 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలారు సుఖేష్ చంద్ర.



బాలీవుడ్ ఐటెం బాంబ్ నోరా తీరు.. ఇప్పుడందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. మరో స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ పై పెట్టిన కేసు ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య తీవ్ర గొడవ రగిలేలా చేస్తూనే.. మధ్యలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ మెడకు చుట్టుకునే వరకు వెళ్లింది.ఇక ఈ ఇయర్ బిగినింగ్‌ లోనే… 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలారు సుఖేష్ చంద్ర. ఆయనతో పాటే.. ఆయన గర్ల్‌ ఫ్రెండ్ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ కూడా ఇదే కేసులో ఇరుక్కున్నారు. ఈడీ నుంచి విచారణ కూడా ఎదుర్కొంటూనే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే బీ టౌన్‌ ఇంటర్నల్ సోర్స్‌ ప్రకారం.. నోరాను కాస్త కూల్ చేసేందుకు.. తనపై ఫైల్ చేసిన కేసును విత్ డ్రా చేసుకునేందుకు జాక్వెలిన్ సల్మాన్ దగ్గరకు వెళ్లారట. మధ్యే వర్తిగా ఈ సమస్యను సాల్వ్ చేయాలని కోరరట. కాని సల్మాన్ మాటను నోరా సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు బీ టౌన్‌ లో పుకార్ . ఇక ఈ విషయం బయటికి రావడంతో.. హీరోయిన్ల కొట్లాటలో.. సల్మాన్ ఇరుక్కుపోయాడనే కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ బాబును కూడా తలపట్టుకునేలా చేస్తున్నాయి.