AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harsha sai: పోలీసుల కన్నుగప్పి తిరుగుతోన్న హర్షసాయి.. వారం రోజులైనా చిక్కని ఆచూకీ

హర్ష సాయి పై రేప్‌ కేసు నమోదై వారం రోజులు అవుతుంది. హర్షసాయి కోసం గాలిస్తోన్నామని నార్సింగి పోలీసులు చెబుతున్నారు. అయితే హర్షసాయి మాత్రం బాధితురాలికి సంబంధించి రోజుకో ఆడియో సోషల్ మీడియాలో రిలీజ్‌ చేస్తున్నాడు.

Harsha sai: పోలీసుల కన్నుగప్పి తిరుగుతోన్న హర్షసాయి.. వారం రోజులైనా చిక్కని ఆచూకీ
Harsha Sai
Rajeev Rayala
|

Updated on: Sep 30, 2024 | 12:10 PM

Share

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై ఓ యువతి అత్యాచార కేసు పెట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించడంతో పాటు బెదిరిస్తున్నదంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. హర్ష సాయి పై రేప్‌ కేసు నమోదై వారం రోజులు అవుతుంది. హర్షసాయి కోసం గాలిస్తోన్నామని నార్సింగి పోలీసులు చెబుతున్నారు. అయితే హర్షసాయి మాత్రం బాధితురాలికి సంబంధించి రోజుకో ఆడియో సోషల్ మీడియాలో రిలీజ్‌ చేస్తున్నాడు. దీంతో నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలని బాధితురాలు కోరుతుంది.

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

రీసెంట్‌గా సైబరాబాద్ సీపీని కలిసిన బాధితురాలు హర్షసాయికి సంబంధించి మరిన్ని ఆధారాలను అందించింది. అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఫిర్యాదు చేసింది. ఇప్పటికే విదేశాలకు పారిపోయి ఉంటాడని అనుమానం కూడా వ్యక్తం చేసింది. వారం రోజులుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నాడు హర్షసాయి హర్షసాయి కోసం గాలిస్తున్నామంటున్న నార్సింగి పోలీసులు. కాగా ఆ యువతే అతని డబ్బుల కోసం వేధిస్తోందని అంటున్నాడు హర్ష సాయి తరపు లాయర్. ప్రేమించమని , పెళ్లి చేసుకోమం వేధించడంతో పాటు డబ్బులు కూడా డిమాండ్ చేసిందని బాధితురాలి లాయర్ అంటున్నారు.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

ఇక హర్షసాయి గురించి తెలియని వారు ఉండరేమో.. గతంలో ఇతగాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో వార్తల్లో నిలిచాడు. యూట్యూబ్‌లో, ఇన్ స్టా గ్రామ్‌లో పలు రీల్స్ చేస్తూ అలాగే పేదలకు సాయం అందిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. పేదలకు డబ్బు సాయం చేస్తూ  ఆవీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాపులర్ అయ్యాడు. అలాగే యూట్యూబ్ నుంచి బాగానే సంపాదించాడు. వీటితో పాటు మొన్నామధ్య ఓ సినిమా కూడా మొదలు పెట్టాడు. హర్ష సాయి హీరోగా మెగా అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు బిగ్ బాస్ బ్యూటీ మిత్ర శర్మ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదలైంది. కానీ ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. ఇక ఇప్పుడు ఇలా రేప్ కేసులో ఇరుక్కున్నాడు హర్ష సాయి.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

View this post on Instagram

A post shared by Harsha sai (@harshasai_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..