హీరో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మట్టి కుస్తీ. గతంలో విష్ణు విశాల్ పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అలాగే రానా నటించిన అరణ్య సినిమాలో కూడా విష్ణు విశాల్ నటించారు. ఇక ఇప్పుడు మట్టి కుస్తీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో హీరో విష్ణు విశాల్ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘మట్టి కుస్తీ’ భార్యా భర్తల ప్రేమ కథ. భార్యాభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కథలో కుస్తీ స్పోర్ట్ కూడా భాగంగా వుంటుంది. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ వుంది. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం. పెళ్లి తర్వాత భార్యాభర్తలకు కొన్ని అంచనాలు వుంటాయి. ఆ అంచనాలని అందుకోలేనప్పుడు ఇగోలు మొదలౌతాయి. మట్టికుస్తీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. స్పోర్ట్స్ కూడా లైట్ హార్టెడ్ గా వుంటుంది. సినిమా చాలా వినోదాత్మకంగా వుంటుంది. ‘మట్టి కుస్తీ’లో నా కెరీర్ లో మొదటి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మసాల ఫిల్మ్.
ఇందులో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వుంటాయి. స్పోర్ట్ ఇరవై నిమిషాల కంటే ఎక్కువే వుంటుంది. ఇందులో నేను కబడ్డీ ప్లేయర్ ని. కానీ కుస్తీ ఆటకి వెళ్తాను. అలా ఎందుకు వెళ్ళాల్సివచ్చిందో.. సినిమా చూసినప్పుడు ఇది చాలా సర్ ప్రైజింగా వుంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా వుంటాయి. ట్రైలర్ లో ” వెయ్యి అబద్దాలాడైన ఒక పెళ్లి చేయమని చెప్పారు. కానీ రెండు అబద్దాలు ఆడి ఈ పెళ్లి చేశాం’ అని డైలాగ్ వుంటుంది. ఆ రెండు అబద్దాలు ఏమిటనేది మీకు సినిమా చూసినప్పుడే తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కట్ చేయడం నా కెరీర్ లో పెద్ద సవాల్ గా అనిపించింది. సర్ ప్రైజ్ రివిల్ చేయకుండ కంటెంట్ ని చెప్పడం ఒక చాలెంజ్. ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ విడుదల చేయడం వరకూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఫస్ట్ లుక్ చూస్తే ఇది స్పోర్ట్ మూవీ అనిపించింది. తర్వాత ఒకొక్కటిగా రివిల్ చేస్తూ ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచి థియేటర్లో చూడాలనే ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశాం అని చెప్పుకొచ్చారు.