Vijayashanti :దాదాపు మూడు దశాబ్దాలతర్వాత ఆ హీరోతో కలిసి నటించనున్న విజయశాంతి..

| Edited By: Anil kumar poka

Dec 23, 2021 | 7:17 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా రాణించిన అందాల తారల్లో విజయశాంతి ఒకరు. హీరోయిన్‌గా కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు విజయశాంతి.

Vijayashanti :దాదాపు మూడు దశాబ్దాలతర్వాత ఆ హీరోతో కలిసి నటించనున్న విజయశాంతి..
Follow us on

Vijayashanti : ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా రాణించిన అందాల తారల్లో విజయశాంతి ఒకరు. హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు విజయశాంతి. హీరోలకు సరిసమానంగా ఫైట్లు.. యాక్షన్ సీన్స్ చేస్తూ లేడీ అమితాబ్ గా పేరుతెచ్చుకున్నారు. ఆతర్వాత విజయాశాంతి సినిమాలు దూరమై రాజకీయాల్లో చేరారు. రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోయారు. ఇక చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు విజయశాంతి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి విజయశాంతి తన నటనతో మరో సారి ఆకట్టుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆతర్వాత విజయ్ శాంతి సినిమాల్లో తిరిగి రాణిస్తారని అంతా అనుకున్నారు కానీ ఆమె ఇంతవరకు మరో సినిమాను అనౌన్స్ చెయలేదు.

ఆతర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ జీ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన కలిసి నటించమని కోరడం దానికి విజయశాంతి కూడా ఓకే అనడం తో మెగాస్టార్ సినిమాలో ఆమె నటిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె మరో సీనియర్ హీరో సినిమాలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ సినిమాలో విజయశాంతి నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. అప్పట్లో బాలయ్య ఎక్కువగా భానుప్రియ, విజయశాంతిలతో జత కట్టారు. బాలయ్య -విజయశాంతి కలిసి నైంసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ ఇద్దరు కలిసి చివరిసారిగా నిప్పురవ్వ సినిమాలో నటించారు. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రలో విజయశాంతి నటించనున్నారని వార్తలు చక్కర్ల కొడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా నిర్మాణం అవుతున్న ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారట. ఇక కొడుకు పాత్రకు శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తండ్రి పాత్రకు జతగా విజయశాంతి నటించనున్నారట. ఈ సినిమాలో బాలయ్య ఒక పాత్రలో ఫ్యాక్షనిస్ట్‌గా మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijayawada: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్‌..

Tollywood Rewind 2021: ఈ సంవత్సరం టాలీవుడ్‌ ఇండస్ట్రీని బతికించింది ఆ ముగ్గురే..

కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టారా!