విజయ్ వెర్సస్ తారక్..బెస్ట్ డ్యాన్సర్ ఎవరు..?

ఒక భాషలో నటిస్తోన్న ఇద్దరు హీరోల మధ్య ఫ్యాన్ వార్ ఉండటం సహజం. కానీ వేరు, వేరు  ఇండష్ట్రీల్లో సినిమాలు చేస్తోన్న ఇద్దరు టాప్ హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు గొడవకు దిగారు. మా హీరో గొప్ప అంటే..మా హీరో గొప్ప అంటూ రచ్చ షురూ చేశారు. ఇంతకీ ఈ తగాదా ఏ విషయంలో అంటారా..? అక్కడికే వస్తున్నాం. యంగ్ హీరో ఎన్టీఆర్ అంటే డ్యాన్స్ అండ్ డైలాగ్స్‌కి ఫేమస్. తారకరాముడి స్టెప్పులకు ఫిదా […]

విజయ్ వెర్సస్ తారక్..బెస్ట్ డ్యాన్సర్ ఎవరు..?
Ram Naramaneni

|

Nov 29, 2019 | 10:25 AM

ఒక భాషలో నటిస్తోన్న ఇద్దరు హీరోల మధ్య ఫ్యాన్ వార్ ఉండటం సహజం. కానీ వేరు, వేరు  ఇండష్ట్రీల్లో సినిమాలు చేస్తోన్న ఇద్దరు టాప్ హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు గొడవకు దిగారు. మా హీరో గొప్ప అంటే..మా హీరో గొప్ప అంటూ రచ్చ షురూ చేశారు. ఇంతకీ ఈ తగాదా ఏ విషయంలో అంటారా..? అక్కడికే వస్తున్నాం. యంగ్ హీరో ఎన్టీఆర్ అంటే డ్యాన్స్ అండ్ డైలాగ్స్‌కి ఫేమస్. తారకరాముడి స్టెప్పులకు ఫిదా అవ్వని తెలుగువాడు ఉండడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా తారక్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇళయదళపతి విజయ్ కూడా తమిళ్‌లో మంచి స్టార్ డమ్ ఉన్న హీరో. విజయ్ పేరు చెబితేనే అరవ జనం పిచ్చెక్కిపోతారు. డ్యాన్స్‌లో కూడా తమిళ హీరోలందరితో పోల్చుకుంటే విజయ్‌కి యూనిక్ స్టైల్ ఉంటుంది.

దీంతో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ డ్యాన్స్ విషయంలో పోట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ స్టెప్పు వేస్తే..టాప్ లేచిపోద్ది అని మనవాళ్లు అంటుంటే..విజయ్ కాలు కదిపితే విధ్వంసమే అని అరవ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.  సోషల్ మీడియాకు హద్దులు ఉండవు కాబట్టి ఒకరిని ఒకరు తెగ ట్రోల్ చేసుకుంటున్నారు. ఇదంతా చూసి ఏంటో వెర్రిమాలోకాలు అంటున్నారు సినీ జనాలు. వాస్తవానికి ఎన్టీఆర్, విజయ్ ఇద్దరూ స్పోర్టీవ్ నేచర్‌తో ముందుకు వెళ్తారు. పలు సినిమా వేడుకల్లో సైతం వారు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఇలా పనికిరాని వాటికి తగువులాడే బదులు, ఆ హీరోలు పేరుతో సేవా కార్యక్రమాలు చేసి వారి గౌరవాన్ని ఇనుమడింపజేయాలని పలువురు కామెంట్ చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu