‘సైరా’ చూడరని ముందే చెప్పా: సీనియర్ నటుడి సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం సైరా. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. అయితే ఇది మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా.. చెర్రీ కూడా ఏ మాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన […]

'సైరా' చూడరని ముందే చెప్పా: సీనియర్ నటుడి సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Nov 29, 2019 | 8:59 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం సైరా. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. అయితే ఇది మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా.. చెర్రీ కూడా ఏ మాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వినిపించింది. కానీ కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్‌లో రాలేదు.

నైజాం, ఉత్తరాంధ్ర మినహా మిగిలిన ఈ ఏరియాల్లోనూ సైరా బ్రేక్ ఈవెన్ కాలేదు. మిగిలిన భాషల్లో కనీస వసూళ్లు కూడా దక్కలేదు. అయితే కంటెంట్ బావున్నా.. ప్రమోషన్లు సరిగా లేకపోవడం వల్లనే సైరా కలెక్షన్లు రాబట్టలేకపోయిందని సినీ విశ్లేషకులు అంచనాలు వేశారు. అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఇందులో నటించినా.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా సైరా టీమ్ ప్రమోషన్లను చేయలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఈ మూవీపై సీనియర్ నటుడు గిరిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సైరా ఎవ్వరూ చూడరని తాను ముందే చెప్పానని గిరిబాబు వెల్లడించాడు.

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గిరిబాబు.. చిరంజీవితో నాకు మంచి అనుబంధం ఉంది. ఓ ఫంక్షన్‌లో చిరును కలిస్తే మాటల సందర్భంలో తాను నరసింహారెడ్డి జీవిత కథలో నటిస్తున్నట్లు చెప్పాడు. అప్పుడే నేను ఈ కథను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించా. దానికి బదులుగా ఏదైనా సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు కదా అని చెప్పా. బాహుబలి లాంటి సినిమాలు చేస్తే చూస్తారు కానీ.. అప్పటి చరిత్రను తీస్తే… ఇప్పటి జనరేషన్‌కు అంతగా ఎక్కదని ముందే చెప్పానని గిరిబాబు చెప్పుకొచ్చారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!