Tamannah: తమన్నా.. విజయ్ వర్మ ప్రేమ నిజమేనా ?.. మరోసారి కలిసి కెమెరాకు చిక్కిన లవ్ బర్డ్స్..

|

Jun 04, 2023 | 3:49 PM

ముఖ్యంగా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి వీరిద్దరు కలిసి పలు ఈవెంట్లకు వెళ్లడం.. రెస్టారెంట్స్ కు వెళ్తూ కెమెరాకు చిక్కడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికీ స్పందించకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Tamannah: తమన్నా.. విజయ్ వర్మ ప్రేమ నిజమేనా ?.. మరోసారి కలిసి కెమెరాకు చిక్కిన లవ్ బర్డ్స్..
Tamannah, Vijay Varma
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. అతి తక్కువ సమయంలోనే భారీగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. అలాగే పలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న మిల్కీబ్యూటీ.. ఇటీవల కొద్ది రోజులుగా నిత్యం వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి వీరిద్దరు కలిసి పలు ఈవెంట్లకు వెళ్లడం.. రెస్టారెంట్స్ కు వెళ్తూ కెమెరాకు చిక్కడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికీ స్పందించకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్దరు కలిసి మరోసారి కెమెరా కంటికి చిక్కారు. శుక్రవారం రాత్రి వీరిద్దరు కలిసి డిన్నర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ముంబాయిలోని బాంద్రాలో డిన్నర్ పార్టీలో వీరు తళుకున్న మెరిశారు. ఇద్దరు కూడా బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించారు. దీంతో ఈ జంట డేటింగ్ గురించి బీటౌన్ లో మరోసారి చర్చ మొదలైంది. కాగా.. విజయ్ వర్మ ఇటీవలే రిలీజైన దహాద్ వెబ్ సిరీస్ లో కనిపించారు.. ఆలాగే.. ఆయన ప్ర్తుతం ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు.. కేవలం వెండితెరపైనే కాకుండా..అటు వెబ్ సిరీస్ చేస్తున్నారు తమన్నా. ఇటీవల ఆమె నటించిన కొత్త సిరీస్ జీ కర్దా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. బాల్యం నుంచి జీవితంలో స్థిరపడే వరకు ఏడుగురి మిత్రుల ప్రయాణం చుట్టూ అల్లుకున్న కథే జీ కర్దా. దీనికి డైరెక్టర్ అరుణిమ శర్మ దర్శకత్వం వహించగా.. ఈ సిరీస్ లో ఆషిమ్, సుహైల్ నాయర్, అన్యా సింగ్, హుస్సేన్ తదితరులు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.