సాధారణంగా సినీ పరిశ్రమలో వారసత్వం అనేది కొనసాగుతుంటుండి. స్టార్ హీరో వారసుల అరంగేట్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తుంటారు. హీరోల కుమారులు హీరోలుగానే అడుగుపెడుతుంటారు. కొందరు మాత్రమే మరో కొత్త దారిలో వెళ్తుంటారు. ఇప్పుడు అదే జాబితాలో ఓ స్టార్ హీరో తనయుడు చేరిపోయారు. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతికి దక్షిణాదిలో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల కోసం తమిళ్ తోపాటు.. తెలుగు అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవలే వారసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే విజయ్ తనయుడు జాసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడని ఆయన అభిమానులు ఎదురుచూశారు. కానీ తన కుమారుడు దర్శకత్వం వైపు ఆసక్తి చూపిస్తున్నాడని గతంలోనే క్లారిటీ ఇచ్చారు విజయ్. ఇక అప్పటి నుంచి జాసన్ సంజయ్ పరిచయం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు సినీరంగంలోకి అడుగుపెట్టబోతున్నారు జాసన్.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ద్వారా జాసన్ సంజయ్ దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై రాబోతున్న కొత్త సినిమాను ఆ సంస్థ అధినేత సుభాస్కరన్ ప్రకటిస్తూ.. ఈ సినిమాకు విజయ్ దళపతి తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించనున్నారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా జరిగిపోయినట్లు తెలియజేస్తూ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
We are beyond excited 🤩 & proud 😌 to introduce #JasonSanjay in his Directorial Debut 🎬 We wish him a career filled with success & contentment 🤗 carrying forward the legacy! 🌟#LycaProductionsNext #JasonSanjayDirectorialDebut @SureshChandraa @DoneChannel1 @gkmtamilkumaran… pic.twitter.com/wkqGRMgriN
— Lyca Productions (@LycaProductions) August 28, 2023
సంజయ్ లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో బి.ఎ. (హానర్స్) కంప్లీట్ చేసాడు. అలాగో టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమాను పూర్తిచేశారు. స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్లో స్పెషలైజేషన్ కోర్సులను చేసి, సినిమా నిర్మాణం పై పూర్తి అవగాహన ఉందని.. జాసన్ సంజయ్ తో కలిసి సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం అవుతుందని లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కర్ అన్నారు.
లైకా ప్రొడక్షన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలో తన తొలి చిత్రం తెరకెక్కిస్తుండడం సంతోషంగా ఉందని.. అలాగే ఈ సినిమా రూపొందించడంతో తనపై పెద్ద బాధ్యత ఉందని అన్నారు విజయ్ తనయుడు జాసన్ సంజయ్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు.. నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్లు తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.