Vijay Sethupathi: నీ ముఖానికి సినిమాలు కూడానా అనేవారు.. ఆసక్తికర విషయం చెప్పిన విజయ్ సేతుపతి
హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గాను మెప్పించారు విజయ్ సేతుపతో. సౌత్ ఆడియన్స్ చేత మక్కల్ సెల్వన్ అని పిలిపించుకునే సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు.
విజయ్ సేతుపతి.. ఈ పేరు తెలియని సౌత్ ఆడియన్స్ ఉండరు. విలక్షణ నటనతో తన తాను నిరూపించుకుంటూ.. తమిళ్ లో పిజ్జా సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు విజయ్ సేతుపతి. ఆ తర్వాత వరుస సినిమాలతో ఆకట్టుకున్నారు. హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గాను మెప్పించారు విజయ్ సేతుపతో. సౌత్ ఆడియన్స్ చేత మక్కల్ సెల్వన్ అని పిలిపించుకునే సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలోనూ చిన్న పాత్రలో కనిపించారు. ఇక దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో విలన్ గా నటించారు.
అలాగే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలోనూ విలన్ గా నటించారు. ఈసెంట్ గా హిందీలో వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇక విజయ్ సేతుపతి కెరీర్ బిగినింగ్ లో చాలా అవమానాలకు గురయ్యారట. విజయ్ సేతుపతి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండియాలో బెస్ట్ నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ తన కెరీర్ లో ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపారు. థియేటర్ లో అకౌంటెంట్ గా పని చేశా.. ఆ టైంలోనే సినిమా అవకాశలకోసం ప్రయత్నించా.. ఫోటోలు పట్టుకుని సినిమా ఆఫీస్ లు చుట్టూ రోజూ తిరిగేవాడిని. అప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. నన్ను చూడగానే నీ ముఖానికి సినిమాలు కూడానా అనేవారు. కొంతమంది నా ఫోటోలు చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు . కొంతమంది అవకాశం ఇచ్చి తీరా సెట్స్ కు వెళ్లిన తర్వాత ఆ పాత్ర మరొకరితో చేయించే వారు అని తెలిపారు..కానీ నేను ఎప్పుడు ఆత్మవిశ్వసం కోల్పోలేదు అని చెప్పుకొచ్చారు.