Vijay Deverakonda Liger : దుమ్ము రేపిన లైగర్ ట్రైలర్.. ఇరగదీసిన విజయ్ దేవరకొండ
హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. విజయ్ సినిమా వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి మొదలవుతుంది.

హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. విజయ్ సినిమా వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి మొదలవుతుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన విజయ్.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. ఇక ఇప్పుడు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh )తో కలిసి హైఓల్టేజ్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా పూరిజగన్నాథ్ లైగర్ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. లైగర్ తో విజయ్ బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం కానున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ‘అక్డి పక్డి’ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. విజయ్ డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టిన ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైగర్ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు డార్లింగ్. ఇక మొదటి నుంచి ఈ సినిమా పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది లైగర్ ట్రైలర్. విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే అనన్య అందాలు, విజయ్ యాక్షన్ సీన్స్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని తెలుస్తోంది.

Prabhas
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న లైగర్ మూవీలో విజయ్ తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనున్నారు. అదేవిధంగా లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రను పూరి చాలా పవర్ఫుల్ గా డిజన్ చేశారని అర్ధమవుతుంది. ట్రైలర్ చూస్తుంటే లైగర్ గర్జించడంతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం గా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు.




