
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా జోడీ మరో సారి ట్రెండ్ అవుతోంది. నెట్టింట వీరి పెళ్లి వార్తలు మళ్లీ గుప్పమంటున్నాయి. ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కానీ రష్మిక, విజయ్ చేతులకు ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్నాయని, త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారని తెగ సంతోషపడిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా వీరి పెళ్లి మూహూర్తంపై చర్చ మొదలైంది. విజయ్-రష్మికల పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అని తెగ చర్చ జరుగుతోంది. అలాగే సింపుల్ గా పెళ్లి చేసుకుంటారా? లేదా డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే ఏకంగా పెళ్లి ముహూర్తం, వేదిక కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కటి కానున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరలవుతోంది. 26వ తేదీన విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని ఇందులో ఉంది. అలాగే రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు వేదిక కానుందని ఒక వార్త హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడీ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది.
కాగా ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక మందన్నా తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన చేతికి ఉన్న రింగ్స్ లో ఒకటి చాలా స్పెషల్ అని చెప్పింది. ఈ విషయంలో జనాలు ఏమనుకున్నా తనకు సంతోషమేనంది. తద్వారా విజయ్ తో తనకు నిశ్చితార్థం జరిగినట్లు చెప్పకనే చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే థామ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది రష్మిక. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ అనే మరో కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.