Liger: లైగర్ సినిమాకు సీక్వెల్.. హింట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ

|

Aug 19, 2022 | 4:02 PM

ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది లైగర్ అనే చెప్పాలి. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు.

Liger: లైగర్ సినిమాకు సీక్వెల్.. హింట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ
Vijay Devarakonda, Puri Jag
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది లైగర్(Liger) అనే చెప్పాలి. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించాడు. ఆగస్టు 25న లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా కనిపించనుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న లైగర్ తో అటు అనన్య టాలీవుడ్ కు.. ఇటు విజయ్ బాలీవుడ్ కు ఒకేసారి పరిచయం కానున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ తో దుమ్మురేపుతున్నారు లైగర్ టీమ్. ఇప్పటికే పలు నగరాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా హీరో విజయ్, ఛార్మి, పూరిజగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంట్రవ్యూలో విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ముందుగా పూరిజగన్నాథ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనన్య చాలా కష్టపడింది. ఈ సినిమాతో అనన్య రెండేళ్లు ట్రావెల్ చేసింది. అయితే అనన్య లో చాలా మార్పు చూశా.. ప్రతి మూడునెలలు ఆమెలో చాలా మార్పు కనిపించింది. ఇంకొక ఏడాది అయితే నువ్వు ఇంకా మంచిగా అవుతావు మనం ఇంకో సినిమా చేద్దాం అని చెప్పా అని పూరిజగన్నాథ్ అన్నారు. వెంటనే విజయ్ మాట్లాడుతూ.. అనన్య నాతో కూడా అదే అంది.. లైగర్ 2లో నేనే కాద హీరోయిన్ ని అని అడుగుతుండేది.. అప్పుడు పూరిగారు రాస్తున్నారు. రాసిన తర్వాత చేద్దాం అని చెప్పా అని విజయ్ అన్నారు. అలాగే లైగర్ 2 చేయాలి.. ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్ అలా ఉన్నాయి అన్నారు. దాంతో లైగర్ 2 కూడా ఉండనుందని హింట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ వార్తతో విజయ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. మరి లైగర్ 2 పై పూరిజగన్నాథ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి