AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaali Sampath : క్రేజీ హీరో విజయ్ దేవరకొండ చేతులమీదుగా ‘గాలిసంపత్’ సాంగ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్నసినిమా `గాలి సంప‌త్`. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు అనిల్  రావిపూడి

Gaali Sampath : క్రేజీ హీరో విజయ్ దేవరకొండ చేతులమీదుగా 'గాలిసంపత్' సాంగ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
Rajeev Rayala
|

Updated on: Mar 06, 2021 | 2:16 PM

Share

Gaali Sampath movie : బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్నసినిమా `గాలి సంప‌త్`. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు అనిల్  రావిపూడి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి అనీష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కి, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీలోని పాప ఓ పాప సాంగ్‌ని క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల‌చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

`పాప ఓ పాప నీ పేరు త‌లిచినే మజ్నున‌య్యానే..పాప ఓ పాప నా పేరే మ‌రిచినే పిచ్చోన్న‌య్యానే..“ అంటూ హుశారుగా సాగే ఈ పాట‌కి స్టార్ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా బెన్ని ద‌యాల్‌, బెన్ హ్యూమ‌న్‌, అనుదీప్ దేవ్ ఫుల్ ఎనర్జీతో ఆల‌పించారు. అచ్చురాజ‌మ‌ణి బాణీలు సంగీత ప్రియుల్ని అల‌రిస్తున్నాయి. మొత్తంగా ఈ ట్రైల‌ర్, పాట‌లు చూస్తుంటే వ‌రుస‌గా ఐదు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా `గాలి సంప‌త్` రూపొందుతోంది అని తెలుస్తోంది. మార్చి7న `గాలి సంప‌త్ గ్రాండ్ ప్రీ రిలీజ్` ఈవెంట్‌ని జ‌రిపి మార్చి 11న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raj Tarun : నేను ఇంతవరకు ట్రై చేయని కొత్త జోనర్లో చేసిన థ్రిల్లర్ మూవీ ఇది : యంగ్ హీరో రాజ్ తరుణ్

KrithiShetty : ఉస్తాద్ సినిమాలో ఉప్పెన బ్యూటీ.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు జోడీగా బెబమ్మ..

Follow Us
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి