Vidya Balan: లూసిఫ‌ర్ రీమేక్‌లో చిరంజీవి సోద‌రిగా విద్యాబాల‌న్.. ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్

లూసిఫ‌ర్‌లో సిస్ట‌ర్ రోల్ గురించి మ‌రోసారి డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. సిస్ట‌ర్ రోల్‌లో చేస్తున్నారంటూ రాధిక‌, ఖుష్బు, విజ‌యశాంతి, జెనీలియా పేర్లు వినిపించాయి. అయితే..

Vidya Balan: లూసిఫ‌ర్ రీమేక్‌లో చిరంజీవి సోద‌రిగా విద్యాబాల‌న్.. ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్
Chiru Vidya Balan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 05, 2021 | 4:35 PM

లూసిఫ‌ర్‌లో సిస్ట‌ర్ రోల్ గురించి మ‌రోసారి డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. సిస్ట‌ర్ రోల్‌లో చేస్తున్నారంటూ రాధిక‌, ఖుష్బు, విజ‌యశాంతి, జెనీలియా పేర్లు వినిపించాయి. అయితే ఆ మ‌ధ్య న‌య‌న‌తార పేరు ఖ‌రారైన‌ట్టు మెగా క్యాంప్ హింట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే ప్లేస్‌కి విద్యాబాల‌న్ అనే మాట కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ మ‌ల్లూ లేడీస్ న‌య‌న్ అండ్‌ విద్యాబాల‌న్ మ‌ధ్య పోటీ ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో తెలుసుకుందాం ప‌దండి. లూసిఫ‌ర్ సినిమా అనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచీ డైర‌క్ట‌ర్ ఎవ‌ర‌నే విష‌యం మీద ఎంత డిస్క‌ష‌న్ జ‌రిగిందో, సిస్ట‌ర్ రోల్ మీద కూడా అంతే గ‌ట్టిగా ఇంట్ర‌స్ట్ క్రియేటైంది. సైరాలో మెగాస్టార్‌తో జోడీ క‌ట్టిన న‌య‌న్‌.. లేటెస్ట్ లూసిఫ‌ర్‌లో సిస్ట‌ర్ రోల్‌లో చేస్తార‌ని మెగా కాంపౌండ్ నుంచి ఇండికేష‌న్స్ కూడా వ‌చ్చేశాయి. న‌య‌న్‌కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశార‌న్న‌ది నిన్న‌టిమాట‌.

మ‌రి లూసిఫ‌ర్‌లో విద్యాబాల‌న్ న‌టిస్తున్నార‌నే మాట లేటెస్ట్ గా ఫిల్మ్ న‌గ‌ర్‌లో గ‌ట్టిగా వినిపిస్తోంది. క‌రోనా కార‌ణంగా ప్రాజెక్ట్ డిలే అవ‌డంతో `నేను చేయ‌లేను` అని న‌య‌న్ చెప్పారా? లేకుంటే విద్యాబాల‌న్ కోసం మ‌రేదైనా కొత్త కేర‌క్ట‌ర్‌ని డిజైన్ చేశారా? అనేది తెలియాల్సిన విష‌యం. ఆల్రెడీ ఎన్‌టీఆర్ బ‌యోపిక్‌తో తెలుగు ఆడియ‌న్స్ కి ద‌గ్గ‌రైన విద్యాబాల‌న్ లేటెస్ట్ గా మెగా మూవీకి సైన్ చేయ‌డం నిజ‌మైతే ఈ డార్లింగ్ అండ్ డ్యాషింగ్‌ లేడీ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నార‌న్న‌ది వాస్త‌వం.

Also Read: ఆక‌లితో ఉన్న పాము… ఓ భారీ సైజ్ గుడ్డును ఎలా మింగేసిందో మీరే చూడండి

చెట్టుకు ఉన్న ఒక్క‌ ఆకుతో సుంద‌ర‌మైన గూడు నిర్మించిన ప‌క్షి… చూస్తే వావ్ అంటారు..