Venu Swamy: చైతూ-శోభితాల జాతకం చెప్పి చిక్కుల్లో పడిన వేణు స్వామి.. మంచు విష్ణు వార్నింగ్! పోలీస్ కేసు కూడా!

|

Aug 12, 2024 | 5:24 PM

సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. అయితే ఇటీవల గురూజీ అంచనాలు తప్పుతున్నాయి. కొందరు రాజకీయ నాయకుల విషయంలో స్వామీజీ చెప్పిన జోస్యం ఫలించలేదు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది.

Venu Swamy: చైతూ-శోభితాల జాతకం చెప్పి చిక్కుల్లో పడిన వేణు స్వామి.. మంచు విష్ణు వార్నింగ్! పోలీస్ కేసు కూడా!
Venu Swamy, Naga Chaitanya, Sobhita Dhulipala,
Follow us on

సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. అయితే ఇటీవల గురూజీ అంచనాలు తప్పుతున్నాయి. కొందరు రాజకీయ నాయకుల విషయంలో స్వామీజీ చెప్పిన జోస్యం ఫలించలేదు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు దిగొచ్చిన వేణు స్వామి ఇక సెలబ్రెటీల జాతకాలు చెప్పనంటూ రెండు నెలల క్రితం సంచలన ప్రకటన చేశారు. అయితే తాజాగా అక్కినేని నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై జోస్యం చెప్పారీ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎంగేజ్ మెంట్ అయిన మరుసటి రోజే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక విశ్లేషణ పోస్ట్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ వేణు స్వామిపై మండిపడుతున్నారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ మాటిచ్చిన వేణు స్వామి ఇప్పుడు మాట తప్పారంటూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా నాగ చైతన్య- శోభితల జాతకానికి సంబంధించి మరో వీడియోను పోస్ట్ చేశారు వేణు స్వామి.

మంచు విష్ణుతో మాట్లాడాను..

‘ మూడురోజుల క్రితం నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకాన్ని నేను విశ్లేషించాను. దీనిపై తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి. నేను ఇంతకు ముందు సమంత, నాగచైతన్య ల జాతకాన్ని చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగానే నాగచైతన్య, శోభితల జాతకాన్ని చెప్పాను. అంతే తప్పా ఇంకేమీ లేదు. రెండు నెలల క్రితం నేను చెప్పినట్లుగా సెలబ్రిటీల జాతకాలు నేను చెప్పను. రాజకీయ విశ్లేషణలు కూడా చేయను. ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నాను. ఇదే విషయంపై మా అధ్యక్షులు మంచు విష్ణు కు కూడా ఫోన్ లో చెప్పాను. ఆయన కూడా మంచి నిర్ణయం తీసుకున్నానన్నారు. తొందర్లోనే కలుద్దామన్నారు’ అని చెప్పుకొచ్చారు వేణు స్వామి.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి పోస్ట్ చేసిన మరో వీడియో..

పోలీస్ కేసు నమోదు!

ఇదిలా ఉంటే నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకం చెప్పినందుకు గానూ వేణు స్వామిపై చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ జరలిస్టుల అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కలిసి వేణు స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వేణు స్వామి మాత్రమే కాకుండా నాగచైతన్య, శోభితపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న అందరిపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.

 

నాగ చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ ఫొటోలు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.