ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే సర్జరీ చేసుకోమన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన వెన్నెల కిషోర్
దేవా కట్టా తెరకెక్కించిన వెన్నెల సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వెన్నెల కిశోర్. అంతకు ముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. మొదటి సినిమాతోనే ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన వెన్నెల కిశోర్ ఆ తర్వాత తన ట్యాలెంట్ తో టాలీవుడ్ లో టాప్ మోస్ట్ కమెడియన్ గా ఎదిగాడు.

రీసెంట్ డేస్‌లో తన కామెడీతో మంచి క్రేజ్ తోపాటు వరుస అవకాశాలు అందుకుంటున్నాడు వెన్నెల కిషోర్. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ థియేటర్స్ లో నవ్వులు పూయిస్తున్నాడు. విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెన్నెల కిషోర్.. ఈ మధ్య ప్రధాన పాత్రల్లోనూ నటిస్తున్నాడు. అంతే కాదు కొన్ని సినిమాల్లో హీరోలకు సమానంగా నటించి మెప్పిస్తున్నాడు. అలా రీసెంట్ గా సింగిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, శ్రీవిష్ణు కామెడీ కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కిషోర్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
వెన్నెల కోశోర్ మాట్లాడుతూ తన సినిమా కెరీర్ గురించి మాట్లాడారు. అలాగే ఓ స్టార్ హీరో పక్కన నటించాలంటే తనను సర్జరీ చేసుకోవాలని ఓ దర్శకుడు చెప్పారని తెలిపాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు సూపర్ మహేష్ బాబు. వెన్నెల కిషోర్ మహేష్ బాబుతో కలిసి దూకుడు సినిమాలో నటించే సమయంలో జరిగిన ఓ విషయాన్ని పంచుకున్నారు. దూకుడు సమయంలో నేను కొంచం బొద్దుగా ఉన్నాను. అయితే మహేష్ బాబు పక్కన ఫ్రెండ్ రోల్ లో కనిపించడానికి నన్ను ఎంపిక చేశారు.
అయితే నేను కొచం బొద్దుగా ఉండటంతో నన్ను లైపో సర్జరీ చేసుకోవాలి అని దర్శకుడు శ్రీను వైట్ల సూచించారని వెన్నెల కిషోర్ తెలిపారు. ఎందుకంటే మహేష్ బాబు స్లిమ్ గా ఫిట్ గా ఉంటారు. ఆయన పక్క ఫ్రెండ్స్ కూడా స్లిమ్ గా ఉండాలని శ్రీను వైట్ల అన్నారు. దాంతో నన్ను సర్జరీ చేయించుకోమన్నారు. కానీ ఆతర్వాత కొన్ని షాట్స్ తర్వాత వద్దులే ఇలానే బాగుంది అని చెప్పారని వెన్నెల కిషోర్ తెలిపారు. మహేష్ బాబుతో కలిసి వెన్నెల కిషోర్, దూకుడు, ఆగడు, బ్రహ్మోత్సవం, సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాల్లో కనిపించి మెప్పించారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.




