నాదీ నీది ఒకటే కథ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వేణు ఊడుగుల(Venu Udugula). తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఇప్పుడు విరాటపర్వం(Virata Parvam )సినిమాటిహో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రానా , సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా రేపు(జూన్ 17న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా, సాయి పల్లవి నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
వెంకీ మాట్లాడుతూ.. విరాట పర్వం లాంటి గొప్ప సినిమా తెలుగులో రావడం ఆనందంగా వుంది అన్నారు. రానా తన తొలి సినిమా లీడర్ నుండి ఇప్పటి వరకూ తన ప్రతి సినిమాని, పాత్రని ఎంతో అంకిత భావంతో చేస్తున్నారు. రానా విరాట పర్వం చేసినందుకు చాలా ఆనందంగా వుంది. ట్రైలర్ చూసినప్పుడే విరాట పర్వం చాలా మంచి చిత్రమని అనుకున్నాను. రానా తప్పకుండా విజేతగా నిలుస్తారు. దర్శకుడు వేణు ఉడుగులకు కంగ్రాట్స్. మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక నిజాయితీ గల ఫిల్మ్ మేకర్ వేణు రూపంలో దొరకడం ఆనందంగా వుంది. విరాట పర్వం లాంటి డిఫరెంట్ కథని తీసుకొని అవుట్ స్టాండింగ్ గా ప్రజంట్ చేశారు. విరాట పర్వం రైటింగ్ , విజువల్స్, నిర్మాణ విలువలు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ అత్యున్నత స్థాయిలో వుంటాయి. సినిమా చూసిన తర్వాత మీరే ఈ విషయాన్ని చెబుతారు. సాయి పల్లవి, ప్రియమణి , జరీనా, నవీన్ చంద్ర అందరూ అవార్డ్ విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాయి పల్లవి నవ్వు చాలు. సాయి పల్లవి కెరీర్ లో విరాటపర్వం ఒక బెస్ట్ ఫిల్మ్. విరాట పర్వంలో నటనకుగాను సాయి పల్లవికి జాతీయ అవార్డ్ వస్తుంది. అంత అద్భుతంగా వెన్నెల పాత్రని పోషించారు సాయి పల్లవి. డానీ, దివాకర్ మణి , సురేష్ బొబ్బిలి, పీటర్ హెయిన్స్ ఇలా సాంకేతిక నిపుణులంతా అత్యుత్తమ స్థాయిలో పని చేశారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ లు ఇలాంటి చాలెంజింగ్ సబ్జెక్ట్ ని తీసుకొని అద్భుతమైన సినిమా చేసినందుకు కంగ్రాట్స్. జూన్ 17న విరాట పర్వం చూడండి. సూపర్ , ఎక్స్టార్డినరీ, అదిరిపోయింది” అన్నారు వెంకీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.