Venkatesh : నా అభిమానులు కాస్త హర్ట్ అవుతారేమో.. కానీ తప్పదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన వెంకీ..

| Edited By: Anil kumar poka

Nov 19, 2021 | 1:26 PM

విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన‌ చిత్రం దృశ్యం 2. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్

Venkatesh : నా అభిమానులు కాస్త హర్ట్ అవుతారేమో.. కానీ తప్పదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన వెంకీ..
Venkatesh
Follow us on

Venkatesh : విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన‌ చిత్రం దృశ్యం 2. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న అమేజాన్ ప్రైమ్‌లో రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో హీరో వెంకటేష్ బిజీ అయ్యారు. తాజాగా ఈ సినిమా గురించి వెంకీ మాట్లాడుతూ.. ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు రాంబాబు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాం బాబు ముఖ్య‌ ఉద్దేశ్యం. అలాంటి పాత్రలో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది అన్నారు. సీక్వెల్ చేస్తే సినిమా హిట్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ కొన్ని అనుమానాలుంటాయి. కానీ జీతూ జోసెఫ్ మాత్రం మొదటి పార్ట్ కంటే అద్భుతంగా స్క్రిప్ట్ రాశారు. రాంబాబు ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడా? అని జనాలు అనుకుంటారు. అంతా బాగుందని అనుకునే సమయంలో ఆరేళ్ల తరువాత ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడం, మళ్లీ సమస్యలు రావడం.. సీటు అంచును కూర్చోబెట్టే సినిమాలు అంటారు కదా?..అలా ఉంటుంది సినిమా అని చెప్పుకొచ్చారు వెంకీ.

ఏం జరిగిందనేది ఫ్యామిలీకి కూడా చెప్పడు. ఫ్యామిలినీ రక్షించడం మాత్రం తెలుసు. ఇది చాలా గొప్ప పాత్ర. మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. రాంబాబు పాత్ర‌లో మ‌రోసారి న‌టించ‌డం చాలా హ్యాపీగా ఉంది అన్నారు వెంకటేష్. సినిమా చేయడం వరకే నా బాధ్యత. విడుదల విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వ‌ను. తప్పూ ఒప్పూ అని ఏమి ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్లిపోవాలి. ఇంకా చాలా సినిమాలు థియేటర్లో కూడా వస్తాయి. ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేశాం అన్నారు.

సినిమాలు తీశామా? రిలీజ్ చేశామా? అంతే.. ఎంజాయ్ చేసే వాళ్లు ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇలాంటి చిత్రాలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత మంది చూస్తారు అని కాదు కానీ..ఈ బడ్జెట్‌కు ఓటీటీ బెస్ట్ అని నిర్మాతలు అనుకున్నారేమో. నా అభిమానులు కాస్త హర్ట్ అవుతారేమో కానీ.. నెక్ట్స్ సినిమాల‌తో థియేటర్లోకి వస్తాను అని వాళ్లకు తెలుసు. అన్నింటికి ఓపిగ్గా ఉండాలి. ఈ సారి ఇలా జరిగిందంతే. అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రాలను చేయబోతోన్నాను. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాను. నేను ఇలాంటి చిత్రాలే చేయలని అనుకోను. నా దగ్గరకు వచ్చిన సినిమాలు మాత్ర‌మే నేను చేస్తాను.అని చెప్పుకొచ్చారు వెంకటేష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Urfi Javed : బిగ్‌బాస్‌ నటి డ్రస్‌పై నెటిజన్ల విసుర్లు.. వార్డ్‌రోబ్‌ కలెక్షన్‌ చెత్తగా ఉందని ట్రోలింగ్‌..

Most Eligible Bachelor: ఆహా అందిస్తున్న అందమైన ప్రేమకథ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.. ఓటీటీకి వచ్చేసిన సినిమా

Bigg Boss 5 Telugu: రెచ్చిపోతున్నారు.. హద్దుమీరుతున్నారు.. ఆ ఇద్దరి పై నెటిజన్స్ ఫైర్.. కారణం ఇదే..