చారడేసి కళ్ళు.. చక్కనైన చిరునవ్వు.. ఫొటోలోని ఈ క్యూటీ ఇప్పుడు క్రేజీ బ్యూటీ.. గుర్తుపట్టారా..
ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులందరిని కట్టిపడేసింది. అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించి.. నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులందరిని కట్టిపడేసింది. అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించి.. నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అవ్వడానికి మలయాళీ భామే అయినా అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అందం అభినయం తో ఆఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ఇంతకు పై ఫొటోలో చిరు నవ్వులు చిందిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. హీరోలకు సరి సమానంగా డాన్స్ లతోనూ ఇరగదీస్తోంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తుంది ఈ హీరోయిన్.. ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారే.. చారడేసి కళ్ళతో అందమైన నవ్వుతు ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఎవరో కాదు..
ఫిదా సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సాయి పల్లవి. సహజమైన అందంతోనే కాదు సహజమైన నటనతో ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా దురుసుకుపోతుంది. కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు. తమిళ్.. మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇటీవలే మరో సారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటిస్తుంది పల్లవి. అలాగే తమిళ్లోనూ ఓ సినిమా చేస్తుంది. తాజా సాయి పల్లవి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న సాయి పల్లవి ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :