AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోకు నాకు చిన్న క్లాష్ వచ్చింది.. అంతా ఆ సినిమావల్లే అంటున్న వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. 2014లో “ముకుంద” సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు వరుణ్. ఈ యంగ్ హీరో విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం 9000 కెఎంపిహెచ్, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్, గాని , గాండీవధారి అర్జున, మట్కా సినిమాలు చేశాడు.

ఆ హీరోకు నాకు చిన్న క్లాష్ వచ్చింది.. అంతా ఆ సినిమావల్లే అంటున్న వరుణ్ తేజ్
Varun Teja
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2026 | 7:35 PM

Share

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. వరుణ్ తేజ్ భార్య లావణ్య ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.. వరుణ్ తేజ్ సినిమా చేసి చాలా నెలలు అయిపొయింది. మట్కా సినిమా తర్వాత వరుణ్ సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చాడు. చాల కాలం తర్వాత ఇప్పుడు కొరియన్ కనకరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ హీరోకు తనకు మధ్యలో చిన్న ఇష్యు వచ్చిందని తెలిపాడు. ఆతర్వాత తాము ఇద్దరం మంచి ఫెండ్స్ అయ్యాం అని తెలిపారు వరుణ్.

వరుణ్ తేజ్, నితిన్ ల మధ్య ఓ ఇష్యు వచ్చిందట.. ఆతర్వాత తామిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారాం అని తెలిపారు వరుణ్. ఒక దర్శకుడు వరుణ్ తేజ్, నితిన్ ఇద్దరికీ ఒకే కథను చెప్పాడట. ముందుగా ఆ కథను నితిన్ చెప్పాడట.. ఆతర్వాత తన దగ్గరకు ఆ ప్రాజెక్ట్ వచ్చిందట.. అయితే నితిన్ ఆ ప్రాజెక్టును చేయకపోవచ్చునని భావించిన వరుణ్ తేజ్, ఆ సినిమాను ఒప్పుకున్నారు. అయితే, నితిన్ ఇంకా ఆ సినిమా జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాడట. ఈ విషయం వరుణ్ తేజ్ కు తెలిసినప్పుడు, ఆయన నితిన్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరంగా చెప్పాడట.

చిత్ర పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు సాధారణమని వరుణ్ తేజ్ అన్నాడు. గతంలో పూరీ జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాను వరుణ్ తేజ్ చేయాల్సి కానీ నితిన్ చేశాడు. అలాగే, నితిన్ చేయాల్సిన లోఫర్ సినిమాను కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో వరుణ్ తేజ్ చేశాడు.. ఇలానే ఆ సినిమా కూడా నితిన్ వదులుకున్నాడనుకొని వరుణ్ తేజ్.. నితిన్ కు ఫోన్ చేయాల్సిన అవసరం లేదని అనుకున్నాడట. కానీ, ఆ ఇష్యు తర్వాత తామిద్దరి మధ్య చాలా మంచి స్నేహ బంధంగా మారిందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..