Varun Tej-Lavanya Tripathi: కుమారుడిని పరిచయం చేసిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి.. ఏం పేరు పెట్టారో తెలుసా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల తండ్రిగా ప్రమోషన్ పొందిన తెలిసిందే. అతని భార్య హీరోయిన్ లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ కుమారుడికి ఘనంగా బారసాల నిర్వహించారు వరుణ్ తేజ్- లావణ్యలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి.

Varun Tej-Lavanya Tripathi: కుమారుడిని పరిచయం చేసిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి.. ఏం పేరు పెట్టారో తెలుసా?
Varun Tej, Lavanya Tripathi

Updated on: Oct 02, 2025 | 3:03 PM

మెగా కపుల్ వరుణ్‌ తేజ్ – లావణ్య త్రిపాఠి దంప‌తులు ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ప్టెంబర్ 10న లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి మురిసిపోయాడు వరుణ్ తేజ్. ఇక చిరంజీవి కూడా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సెట్స్‌ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్‌, లావణ్యల లకు అభినందనలు తెలిపారు.
మ‌న‌వడిని చేతుల్లోకి తీసుకుని లాలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇటీవల వరుణ్‌ తేజ్ – లావణ్య త్రిపాఠి దంప‌తుల ముద్దుల కుమారుడికి బారసాల వేడుక జరిగింది. మెగా, అల్లు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రిలీజ్ చేయలేదని తెలుస్తోంది. అయితే దసరా పండగను పురస్కరించుకుని స్వయంగా వరుణ్ తేజ దంపతులే తమ కుమారుడిని అందరికీ పరిచయం చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ కుమారుడి ఫొటోలు షేర్ చేసిన లావణ్య- వరుణ్.. ‘ఆంజనేయ స్వామి దయతో పుట్టిన మా బాబుకు ‘వాయువ్‌ తేజ్‌ కొణిదెల’ అనే పేరు పెట్టాం. మీ అందరి దీవెనలు కావాలి’ అని పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం వరుణ్ తేజ్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు మెగా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా వరుణ్-లావణ్యలది ప్రేమ వివాహం. 2017లో ‘మిస్టర్‌’ సినిమా షూటింగ్ లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఆరేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. చివరకు 2023 నవంబర్‌ 1న ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహబంధంతో ఒక్కటయ్యారీ లవ్ బర్డ్స్. ఇప్పుడీ ప్రేమ బంధానికి ప్రతీకగా వీరి జీవితంలోకి ఒక బిడ్డ కూడా అడుగు పెట్టాడు.

వరుణ్ తేజ్ పోస్ట్..

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజ్’ అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి అధర్వ మురళితో కలిసి నటించిన ‘టన్నెల్’ మూవీ ఈ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .