AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viraaji Trailer: హాస్పిటల్‏లో భయంకరమైన శబ్దాలు.. ఆత్మలతో మాట్లాడే వరుణ్ సందేశ్.. ఉత్కంఠగా విరాజి ట్రైలర్..

డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం విరాజి అనే హారర్ కథతో అడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్ అందరిలో ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం క్యూరియాసిటిని కలిగిస్తోంది.

Viraaji Trailer: హాస్పిటల్‏లో భయంకరమైన శబ్దాలు.. ఆత్మలతో మాట్లాడే వరుణ్ సందేశ్.. ఉత్కంఠగా విరాజి ట్రైలర్..
Viraaji Trailer
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2024 | 11:12 PM

Share

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. నెమ్మదిగా అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన వరుణ్ సందేశ్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం విరాజి అనే హారర్ కథతో అడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్ అందరిలో ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం క్యూరియాసిటిని కలిగిస్తోంది.

ట్రైలర్ వీడియోలో.. వర్షంలో ఒక భవనం.. అందులో తల విరిగిపోయిన విగ్రహం కనిపిస్తుంది. మనుషుల ముఖాలు కనిపించకుండా ఓ వ్యక్తి మాత్రం తన స్నేహితులను పిలుస్తుంటాడు. ఒక టేబుల్ చుట్టూ వరుణ్ సందేశ్ తోపాటు మరో ముగ్గురు కూర్చొని ఉండగా.. 1970ల్లో ఊరికి దూరంగా మెంటల్ పేషెంట్స్ కోసం హాస్పిటల్ కట్టారు.. అది కొన్నాళ్లు బాగానే రన్ అయ్యింది అదే సమయంలో.. అంటూ ప్రమోదిని చెప్పే డైలాగ్ తో ఆ పాత బిల్డింగ్ పై క్లారిటీ వస్తుంది.

ఓ మెంటల్ ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఆధారంఘా ఈ సినిమమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో వరుణ్ సందేశ్ ఒక డ్రగ్ అడిక్ట్ గా కనిపిస్తుంటాడు. ట్రైలర్ తోనే ప్రేక్షకులను భయపెడుతున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. వచ్చే నెల 2న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలలో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.