
మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా కోసం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సినీ లవర్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమాను 2027 సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అనౌన్స్ మెంట్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేశారు. అలాగే మహేష్ బాబు లుక్ ఫ్యాన్స్ కు , ఆడియన్స్ కు పిచ్చెక్కించింది. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించనున్నాడు.
ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ ను కుంభ అనే టైటిల్ తో పోస్టర్ ను, అలాగే ప్రియాంకను మందాకినీ గా చూపిస్తూ పోస్టర్స్ విడుదల చేశారు. అలాగే మహేష్ బాబు ఈ సినిమాలో రుద్రపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వారణాసి సినిమా టీమ్ రెమ్యునరేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు రూ. 100కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. అలాగే సినిమా ప్రాఫిట్స్ లోనూ షేర్ ఉంటుందని టాక్.
అలాగే రాజమౌళి రూ. 200కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అదేవిధంగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30కోట్లు అందుకుంటుందని అంటున్నారు. వీరితోపాటు పృథ్వీరాజ్ రూ. 20కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. సినిమా ఏకంగా రూపొందించడానికి ఏకంగా 3 ఏళ్లు పడుతుంది. కాబట్టి ఆ మాత్రం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు. ఇక సినిమా బడ్జెట్ రూ. 1200కోట్లతో తెరకెక్కుతోందని వార్తలు సోషల్ మీడియాలో, ఇటు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి