వకీల్ సాబ్ సెట్‌లో పవన్.. ఫోటో లీక్
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. 'వకీల్ సాబ్' చిత్రీకరణ మళ్లీ షురూ అయ్యింది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ మళ్లీ షురూ అయ్యింది. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్.. దాదాపు ఏడు నెలల తర్వాత ఇటీవలే పునఃప్రారంభించారు. అయితే పవన్ లేకుండా మిగిలినవారిపై తొలుత షూటింగ్ నిర్వహించారు. తాజాగా హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కోర్టు సెట్‌లో డైరెక్టర్ వేణుశ్రీరామ్ పవన్‌పై కీలక సన్నివేశాలు తీశారు. అన్యాయానికి గురైన బస్తీ వాసులకు అండగా పోరాడేందుకు సిద్ధమంటూ వారికి అభయమిచ్చే సీన్స్ పవన్‌పై చిత్రీకరించారు. అందుకు సంబంధించిన ఫోటో తాజాగా లీకయ్యింది.
‘వకీల్ సాబ్’ కోర్టుకు వెళ్లే సన్నివేశంలో హీరోయిన్స్ అంజలి, నివేదా థామస్, అనన్యలు పాల్గొన్నారు. హిందీలో అమితాబ్ నటించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
Also Read :