Upendra UI: 2040లో ఈ ప్రపంచం ఎలా ఉండనుంది? భయపెట్టిస్తోన్న ఉపేంద్ర యూఐ టీజర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

|

Dec 02, 2024 | 3:03 PM

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన తాజా చిత్రం యూఐ ది మూవీ. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ఉప్పీనే ఈ స్కై ఫై థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

Upendra UI: 2040లో ఈ ప్రపంచం ఎలా ఉండనుంది? భయపెట్టిస్తోన్న ఉపేంద్ర యూఐ టీజర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Upendra Ui Movie
Follow us on

కన్నడ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూఐ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు తీసే ఉప్పీ యూఐ సినిమాలో ఏం చూపిస్తున్నాడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఎట్టకేలకు దీనికి సమాధానం దొరికింది. ‘యూఐ’ చిత్రానికి సంబంధించిన టీజర్ సోమవారం (డిసెంబర్ 02) విడుదలైంది. వార్నర్ (హెచ్చరిక) పేరుతో రిలీజైన ఈ టీజర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రపంచంలో ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్, కోవిడ్ -19, ద్రవ్యోల్బణం, AI, నిరుద్యోగం, ప్రపంచ యుద్ధాలు వాటి పర్యవసానాలు ఈ సినిమాలో చూపించనున్నారు. టీజర్ లో ఈ సినిమా కథ 2040లో మొదలవుతుందని చూపించారు. మొత్తానికి 2040 కల్లా ఆహారం కోసం ఒకరిని ఒకరు చంపుకునే రోజులు రాబోతున్నట్లు టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఇక విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్, సలార్ సినిమాలను తలపిస్తోంది. ఇక పెద్ద కారులో ఉపేంద్ర ఎంట్రీ ఇవ్వడం, చాలా మంది అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆ వెంటనే ఉప్పీ గన్ తీసుకుని కాల్పులు జరుపుతూ ‘మీధిక్కారం కంటే నా అధికారానికి పవర్ ఎక్కువ’ అని చెప్పడం హైలెట్ గా నిలిచింది.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న యూఐ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం తెలిపింది. అయితే మరికొన్ని రోజుల్లోనే పాన్ ఇండియా మూవీ ‘మ్యాక్స్’ సినిమా రాబోతుంది కాబట్టి ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుందేమో అని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగడం లేదు. అనుకున్నట్టుగానే డిసెంబర్ 20న ‘యూఐ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇవి కూడా చదవండి

డిసెంబర్ 20న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్..

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూఐ’. ఈ చిత్రంలో రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు నటించారు. లహరి ఫిల్మ్స్‌ అండ్‌ వెనుస్‌ ఎంటర్‌టైనర్స్‌ బ్యానర్లపై జి. మనోహరన్, కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఉపేంద్ర యూఐ సినిమా తెలుగు టీజర్

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.