Upasana: ‘మీ పనులు నా మనసును కదిలించాయి’.. గవర్నర్‌ తమిళిసైని కలిసి ప్రశంసించిన ఉపాసన.. కారణమిదే

తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కొణిదెల కలిశారు. గురువారం (ఫిబ్రవరి 01) రాజ్‌ భవన్‌కు వెళ్లిన ఉపాసన అక్కడ గవర్నర్‌కు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా గిరిజనుల కోసం గవర్నర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఉపాసన కొనియాడారు.

Upasana: మీ పనులు నా మనసును కదిలించాయి.. గవర్నర్‌ తమిళిసైని కలిసి ప్రశంసించిన ఉపాసన.. కారణమిదే
Upasana Konidela, Tamilisai Soundararajan

Updated on: Feb 01, 2024 | 6:41 PM

తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కొణిదెల కలిశారు. గురువారం (ఫిబ్రవరి 01) రాజ్‌ భవన్‌కు వెళ్లిన ఉపాసన అక్కడ గవర్నర్‌కు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా గిరిజనుల కోసం గవర్నర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఉపాసన కొనియాడారు. గిరిపుత్రుల అభివృద్ధి, సంక్షేమ కోసం చేస్తున్న గవర్నర్‌ తమిళి సై చేస్తున్న పనులు నా మనసును కదిలించాయని ఉపాసన పేర్నొన్నారు. మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు’ అంటూ గవర్నర్‌ను కలిసిన ఫొటోలను తన ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు ఉపాసన. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లోని గిరిజన గ్రామాలను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ దత్తత తీసుకున్నారు. తెలంగాణ రాజ్ భవన్ తరుపున నాగర్ కర్నూలు జిల్లాలో 6 చెంచు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్న తమిళి సై అక్కడ తరచూ పర్యటిస్తున్నారు. నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం వంటి మౌలిక వసతులును కల్పిస్తూ గిరిపుత్రుల జీవన ప్రమాణాలను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిసి మరీ ప్రశంసలు తెలిపారు ఉపాసన.

కాగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ కళామతల్లికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు చిరంజీవిని ఎంపిక చేశారు. కాగా ఇది వరకే మెగా ఫ్యామిలీలో ఒకరు పద్మ విభూషణ్‌ అందుకున్నారు. ఉపాసన తాతగారైన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 2010లో పద్మ విభూషణ్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తన మామగారు చిరంజీవి పద్మ విభూషణ్ అందుకోవడంతో ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోతోంది ఉపాసన.

ఇవి కూడా చదవండి

తమిళి సై తో ఉపాసన..

ఉపాసన ఇంట్లో ఇద్దరు పద్మ విభూషణులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.