మెగాస్టార్ చిరంజీవి కోడలు.. పాన్ ఇండియా స్టా్ర్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అపోలో సంస్థల ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు అపోలోలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాసన.. అటు మరికొన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతుంది. అలాగే కొన్ని కొత్తరకాల వ్యాపారాలను కూడా ప్రారంభించి బిజినెస్ రంగంలో తిరుగులేని మహిళా శక్తిగా దూసుకుపోతుంది. అపోలో ఆసుపత్రిలో కీలక బాధ్యతలు పోషిస్తున్న ఉపాసన.. ఇటు హెల్త్ కేర్ రంగంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటారు. అలాగే హెల్త్ కేర్, ఫిట్నెస్ కేర్ గురించి ఎప్పటికప్పుడు అవసరమైన విషయాలను అందిస్తుంటారు. తాజాగా యువ మహిళలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది ఉపాసన. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో నిర్వహించిన ఓ ఈవెంట్లో పాల్గొంది ఉపాసన. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఎవరైతే హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాలనుకుంటున్నారో అలాంటి యువ మహిళల కోసం నేను చూస్తున్నాను. నేను మీ కో ఫౌండర్ అవుతాను. నేను మీ పార్ట్నర్ అవుతాను. మీకు హెల్ప్ చేస్తాను. ఇండియాలో హెల్త్ కేర్ సిస్టంను ఛేంజ్ చేయడానికి మీతో ఉంటాను” అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ రాసుకొచ్చింది.
“హెల్త్ కేర్ రంగంలో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా..? మహిళలు ఎదిగేందుకు, అభివృద్ధి చెందేందుకు వ్యవస్థను నిర్మించడానికి నాతో చేతులు కలపండి. మీ బిజినెస్ పర్పస్, మీ బిజినెస్ ఎవరిపై ప్రభావం చూపుతుంది. మీ బిజినెస్ మన ప్లానెట్ కు ఎలాంటి పాజిటివిటీని ఇస్తుంది.. నన్ను మీరు కో ఫౌండర్ గా ఎందుకు కోరుకుంటున్నారు వంటి వివరాలను cofounder@urlife.co.in వెబ్ సైట్ లో సబ్మిట్ చేయండి” అంటూ రాసుకొచ్చింది. హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాలనుకునే మహిళలకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు.
ఉపాసన షేర్ చేసిన వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.