Upendra: మరో అద్భుతాన్ని చెక్కుతోన్న ఉపేంద్ర.. స్పానిష్, జర్మన్ భాషల్లో కూడా రిలీజ్
గతేడాది ఉపేంద్ర నటించిన మూవీ 'కబ్జా' అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించగా.. పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేశారు. అయితే ఎక్కడో తేడా కొట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకి నష్టం తెచ్చింది. దీంతో ఈసారి మెగాఫోన్ పట్టి సినిమా తీస్తున్నారు ఉపేంద్ర.

ఉపేంద్ర.. కేవలం యాక్టర్‌గానే చాలామందికి తెల్సు. కానీ ఆయనలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు. విభిన్నమైన చిత్రాలు తీసిన ఉపేంద్ర.. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్నాడు. దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన మెగాఫోన్ పట్టి.. వరల్డ్ ఆఫ్ యూఐ (UI) అనే డిఫరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో ఉపేంద్ర ఏదో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమా ట్రోల్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చిందండోయ్. తాజాగా ఈ మూవీ గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.
పెద్ద ఎత్తున వరల్డ్ ఆఫ్ యూఐ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇండియన్ లాంగ్వేజస్ మాత్రమే కాదు.. ఇటాలియన్, , స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ కూడా ఈ సినిమా విడుదల చేసుందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఈ వార్త ఇప్పుడు ఇన్ స్టా, ఎక్స్‌లో తెగ వైరల్ అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రాన్ని మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇప్పటివరకూ తన కెరీర్‌లో 60కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన ఉపేంద్ర.. 11 మూవీస్ డైరెక్షన్ చేశారు. అలానే పలు లిరిసిస్ట్‌గా మెరిశారు. ఏం చేసిన వైవిధ్యతను చూపించేందుకు ఆయన ఆరాటపడుతుంటారు. వరల్డ్ ఆఫ్ యూఐ తప్పకుండా అలరిస్తుందని గతంలో బలంగా చెప్పారు ఉపేంద్ర. ఆయన మాట నిజమవ్వాలని మనమూ కోరుకుందాం…
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.