Video: సచిన్ మాస్టర్ బ్లాస్టర్ ఇన్నింగ్.. ఆ ట్రేడ్ మార్క్ షాట్స్ చూస్తే మతిపోవాల్సిందే
సచిన్ టెండూల్కర్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభను చాటుకున్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ఇండియా మాస్టర్స్ తరఫున ఆడిన సచిన్, అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. వడోదరలో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 64 పరుగులు చేసి, అభిమానులను పాత జ్ఞాపకాల్లో తేల్చాడు. అతని అద్భుత ప్రదర్శనకైనా, మిగతా ఆటగాళ్లు విఫలమవ్వడంతో ఇండియా మాస్టర్స్ ఆస్ట్రేలియా మాస్టర్స్ చేతిలో ఓటమిని చవిచూసింది.

51 ఏళ్లకు సాధారణంగా ఏ అథ్లెట్ అయినా ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికినట్టే. ఒకవేళ మ్యాచ్ ఆడాల్సి వచ్చినా, ఛారిటీ గేమ్స్ లేదా ప్రదర్శన నిమిత్తమే బ్యాట్ పట్టుకుంటారు. కానీ సచిన్ టెండూల్కర్ మాత్రం ఈ నిబంధనలను తుడిచిపెట్టేస్తూ తన అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ఇండియా మాస్టర్స్ తరఫున బరిలోకి దిగిన సచిన్, తన మైదానపు మాంత్రికత్వాన్ని మరోసారి ప్రదర్శించాడు. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా మాస్టర్స్ vs ఆస్ట్రేలియా మాస్టర్స్ మ్యాచ్‌లో సచిన్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు, అతి తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, క్రికెట్ అభిమానులను పాత జ్ఞాపకాలలో తేల్చాడు. 33 బంతుల్లో 64 పరుగులు చేసిన సచిన్, నాలుగు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ధాటిగా ఆడాడు.
అయితే, సచిన్ ఒక్కడే రాణించినా, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఇండియా మాస్టర్స్ 95 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్, ఆస్ట్రేలియాను భారీ స్కోర్ చేయకుండా ఆపలేకపోయింది. షేన్ వాట్సన్ (110 నాటౌట్), బెన్ డంక్ (132 పరుగులు) చెలరేగడంతో ఆస్ట్రేలియా మాస్టర్స్ 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 269 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా మాస్టర్స్ 174 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన ఇండియా మాస్టర్స్, ఈ ఓటమితో తొలిసారి వెనుకబడ్డా, పాయింట్ల పట్టికలో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సచిన్ టెండూల్కర్ మళ్లీ తన మాంత్రిక బ్యాటింగ్‌తో మైదానాన్ని గర్జింపజేశాడని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు!
సచిన్ టెండూల్కర్ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ఆనందం పెరుగుతుంది. భారత క్రికెట్ చరిత్రలో అతడి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్, దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆటను శాసించాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అద్వితీయమైన ప్రదర్శన ఇచ్చిన సచిన్, 100 అంతర్జాతీయ శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
2011 వన్డే ప్రపంచకప్ గెలుచుకోవడం అతడి కెరీర్‌లో అతిపెద్ద విజయంగా నిలిచింది. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినా, ఇప్పటికీ అతడి అభిమానులు ప్రతి మ్యాచ్‌లో అతడిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సచిన్ అంటే కేవలం ఒక ఆటగాడు కాదు, క్రికెట్‌కే పూజారిలాంటివాడు!
2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినప్పటికీ, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచానికి ఇప్పటికీ దగ్గరగానే ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా తన అనుభవాన్ని యువ క్రికెటర్లతో పంచుకుంటూ భారత క్రికెట్‌కు మద్దతుగా నిలుస్తున్నాడు.
2014లో భారత రాష్ట్రపతి నామినేట్ చేసిన రాజ్యసభ ఎంపీగా సేవలు అందించిన సచిన్, సమాజ సేవలో కూడా ముందుండాడు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు విద్య, వైద్యంగా సహాయపడుతున్నాడు.
ప్రతిష్టాత్మక లెజెండ్స్ లీగ్ క్రికెట్ లాంటి టోర్నీల్లో భాగంగా మైదానంలో సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా, భారత యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా నిలిచి, భారత క్రికెట్ అభివృద్ధికి తనవంతు సహాయం చేస్తున్నాడు. క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ, అభిమానుల మనసులో సచిన్ క్రికెట్ దేవుడిగానే ఉంటాడు!
𝐓𝐡𝐚𝐭’𝐬 𝐡𝐨𝐰 𝐲𝐨𝐮 𝐝𝐨 𝐢𝐭! 😎
𝙎𝙖𝙘𝙝𝙞𝙣 𝙩𝙞𝙣𝙜𝙡𝙞𝙣𝙜 𝙨𝙥𝙞𝙣𝙚𝙨 𝙬𝙞𝙩𝙝 𝙩𝙝𝙖𝙩 𝙨𝙞𝙜𝙣𝙖𝙩𝙪𝙧𝙚 𝙨𝙩𝙧𝙖𝙞𝙜𝙝𝙩 𝙨𝙞𝙭! 🚀✨#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/A11weJAGox
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 5, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



