AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK S4: చంద్రబాబుతో మాములుగా ఉండదు..! బావగారికి బాలయ్య టాస్క్‌లు.. ఆయన ఏం చేశారంటే

హోస్ట్ గా హుషారైన మాటలు, తికమక పెట్టే ప్రశ్నలతో గెస్ట్ లుగా వచ్చిన వారిని ఇరకాటంలో పడేస్తున్నారు బాలయ్య. ఇక అన్ స్టాపబుల్ షో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే చాలా మంది స్టార్ హీరోలు గెస్ట్ లుగా హాజరయ్యి ఆకట్టుకున్నారు.

Unstoppable with NBK S4: చంద్రబాబుతో మాములుగా ఉండదు..! బావగారికి బాలయ్య టాస్క్‌లు.. ఆయన ఏం చేశారంటే
Unstoppable With Nbk
Rajeev Rayala
|

Updated on: Oct 23, 2024 | 5:57 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రాణిస్తూనే మరోపక్క హోస్ట్ గా టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోకు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో సంచనల రేటింగ్స్ తో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. మునుపెన్నడూ చూడని విధంగా బాలయ్య ఈ టాక్ షోను నడిపిస్తున్నారు. హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటసింహం.. ఇప్పుడు హోస్ట్ గా హుషారైన మాటలు, తికమక పెట్టే ప్రశ్నలతో గెస్ట్ లుగా వచ్చిన వారిని ఇరకాటంలో పడేస్తున్నారు. ఇక అన్ స్టాపబుల్ షో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే చాలా మంది స్టార్ హీరోలు గెస్ట్ లుగా హాజరయ్యి ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి : Actress : రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతోపాటు చాలా మంది యంగ్ హీరోలు కూడా ఈ షోకు హాజరయ్యారు. అలాగే రాజకీయ నాయకులూ కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా బాలయ్య షోకు హాజరయ్యి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గతంలో ప్రతిపక్ష నేతగా హాజరయిన చంద్రబాబు.. ఈసారి ముఖ్యమంత్రి హోదాలో ఈ షోకు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి :దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

కాగా ఇప్పటికే ఈ బాలయ్య , బాబు ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. బాలయ్య చమత్కారానికి చంద్రబాబు సమయస్పూర్తి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అలాగే ఈ ఎపిసోడ్ లో ఎన్నో విషయాలను పంచుకున్నారు చంద్రబాబు, జైలుకు వెళ్లిన సంఘటనలు, అప్పటి పరిస్థితుల గురించి కూడా ఈ షోలో మాట్లాడారు. అలాగే బాలకృష్ణ చంద్రబాబుకు రెండు టాస్క్ లు కూడా ఇచ్చారు. చంద్రబాబును తికమక పెట్టే ప్రశ్నలతో పాటు ఇలా టాస్క్ లతోనూ బాబును ఇరకాటంలో పడేశారు బాలయ్య. టాస్క్ ల్లో భాగంగా ఒకటి బాలకృష్ణల తొడ కొట్టాలి, లేదా పవన్ కళ్యాణ్ మ్యానరిజం చేసి చూపించాలి అని చెప్పారు బాలయ్య. మరి బాబు గారు ఏం చేశారో తెలియాలంటే అక్టోబర్ 25న రాత్రి 8:30గంటలకు స్ట్రీమింగ్ అయ్యే అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ చూడాల్సిందే.. ఈ అదిరిపోయే ఎపిసోడ్ ను ఆహాలో చూసి ఆనందించండి.

ఇది కూడా చదవండి : Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us