AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna : చెమ్మగిల్లిన కళ్ళతో.. బరువెక్కిన గుండెతో చెల్లెలి పాడే మోసిన బాలయ్య..

నందమూరి ఫ్యామిలిలో జరిగిన విషాదం గురించి అందరికి తెలిసిందే.. ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.

Nandamuri Balakrishna : చెమ్మగిల్లిన కళ్ళతో.. బరువెక్కిన గుండెతో చెల్లెలి పాడే మోసిన బాలయ్య..
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Aug 03, 2022 | 4:59 PM

Share

నందమూరి(Nandamuri)ఫ్యామిలిలో జరిగిన విషాదం గురించి అందరికి తెలిసిందే.. ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం నందమూరి కుటుంబసభ్యులను.. అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.  జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లోనే ఉమామహేశ్వరి మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు, మనోవేదన కారణంగా ఆమె తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక ఈరోజు వెల్లడి కానుంది. ఆమె మృతి పై జూబ్లీహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఈ రోజు ఉమామహేశ్వరి అంతక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. ఉమామహేశ్వరి సోదరులు ఆమె పాడెను మోశారు. వీరిలో నందమూరి బాలకృష్ణ తన చెల్లెలి పాడె ను మోశారు. చెమ్మగిల్లిన కళ్లతో.. బరువెక్కిన హృదయంతో బాలయ్య ఉమామహేశ్వరికి చివరి వీడ్కోలు పలికారు. బాలయ్య చెల్లెలి పాడె మోయడం చూసి అభిమానులు సైతం కంటతడి పెట్టుకున్నారు. పలువురు సినీ , రాజకీయ నాయకులు ఉమామహేశ్వరి అంత్యక్రియలను హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ విదేశాల్లో ఉండటంతో ఆయన హాజరుకాలేకపోయారని తెలుస్తోంది. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు. ఒకరు దీక్షిత మరొకరు విశాల.. వీరిలో విశాల అమెరికాలో ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Follow Us