TV9 WITT Summit 2024: టీవీ9 మెగా ఎన్‌క్లేవ్‌లో ప్రముఖ నటి కంగనా.. వేదికపై ఏం మాట్లాడనుందంటే?

భారతదేశపు నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ Tv9 తన వార్షిక ఫ్లాగ్‌షిప్ కాన్ క్లేవ్‌ 'వాట్ ఇండియా థింక్స్ టుడే' రెండో ఎడిషన్‌ ఆదివారం (ఫిబ్రవరి 25) ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, వ్యాపారవేత్తలు, ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు ఈ సమ్మిట్‌ లో పాల్గొననున్నారు

TV9 WITT Summit 2024: టీవీ9 మెగా ఎన్‌క్లేవ్‌లో ప్రముఖ నటి కంగనా.. వేదికపై ఏం మాట్లాడనుందంటే?
Kangana Ranaut, TV9 WITT Summit 2024

Edited By:

Updated on: Feb 24, 2024 | 5:41 PM

భారతదేశపు నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ Tv9 తన వార్షిక ఫ్లాగ్‌షిప్ కాన్ క్లేవ్‌ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండో ఎడిషన్‌ ఆదివారం (ఫిబ్రవరి 25) ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, వ్యాపారవేత్తలు, ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు ఈ సమ్మిట్‌ లో పాల్గొననున్నారు. అలాగే పలువురు బాలీవుడ్ నటీమణులు కూడా సందడి చేయనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ప్రసంగించనున్నారు. 2006లో గ్యాంగ్‌స్టర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించింది కంగనా. మొదటి చిత్రంలోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వో లమ్హే, లైఫ్ ఇన్ ఎ మెట్రో, రాజ్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, నో ప్రాబ్లమ్, తను వెడ్స్ మను, క్వీన్, రివాల్వర్ రాణి, సిమ్రాన్, మణికర్ణిక, పంగా తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పటి వరకు ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు అందుకుందీ అందాల తార. అలాగే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా ప్రదానం చేసింది. కేవలం సినిమాలే కాదు సామాజిక సమస్యలు, ఇతర అంశాలపైనా గొంతువిప్పుతుంటుంది కంగనా రనౌత్‌. సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ జీవిత కథతో ఎమర్జెన్సీ సినిమాను తెరకెక్కించింది. ఇందులో ఆమె నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తోంది.

ఇలా భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఇప్పుడు Tv9 నెట్‌ వర్క్‌ వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఇందులో ఆమె ‘Creativity: World is My Oyster’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. అలాగే సదస్సు రెండో రోజు అంటే సోమవారం ఫిబ్రవరి 26న కంగనా ప్రసంగం ఉండనుంది. అలాగే తన సినిమా కెరీర్‌, వ్యక్తిగత విషయాలు, తన సక్సెస్ సీక్రెట్స్ ను అందరితో షేర్ చేసుకోనుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి