Prerana Kambam: రష్మికతో మల్టీస్టారర్.. కానీ ఏది నెరవేరలేదు.. ప్రేరణ ఎమోషనల్ కామెంట్స్..

బుల్లితెరపై అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రేరణ కంభం. కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రేరణ.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉంది.

Prerana Kambam: రష్మికతో మల్టీస్టారర్.. కానీ ఏది నెరవేరలేదు.. ప్రేరణ ఎమోషనల్ కామెంట్స్..
Prerana Kambam, Rashmika Ma

Updated on: Jul 18, 2025 | 9:07 PM

ప్రేరణ కంభం.. బుల్లితెర ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ రోల్ పోషించిన ప్రేరణ.. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. తన ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో నుంచి బయటకు రాగానే తన భర్త శ్రీపాదతో కలిసి ఇస్మార్ట్ జోడి మూడో సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మరీ కప్పు కొట్టింది. ప్రస్తుతం కన్నడలో క్వాల్టీ కిచెన్ అనే కామెడీ షోలో పాల్గొంటుంది. అలాగే ఇటు తెలుగులో పలు సీరియల్స్, రియాల్టీ షోస్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేరణ.. తన బెస్ట్ ఫ్రెండ్ రష్మిక మందన్నాను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ప్రేరణ కంభం, రష్మిక మందన్నా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. కలిసి ఆడిషన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని బిగ్ బాస్ రియాల్టీ షోలో బయటపెట్టింది ప్రేరణ. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేరణ మాట్లాడుతూ.. “నాకు బద్ధకం ఎక్కువ.. ఒక్కోసారి స్నానం చేయడానికి కూడా బద్ధకమనిపిస్తుంది. నా భర్తతో నేను సంతోషంగానే ఉన్నాను. కానీ ప్రేమలో ఉన్నప్పుడు మేము బ్రేకప్ చెప్పుకున్నాము. ఆ తర్వాత వెంటనే కలిసిపోయేవాళ్లం. ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలో హీరో చెంపపై ముద్దు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

ఇక రష్మికను ఉద్దేశిస్తూ.. “నేను తెలుగులో స్టార్ అవుతా.. రష్మిక కన్నడలో స్టార్ అవుతుంది. ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ చేయాలి అని రష్మిక ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్లు. నేను కూడా చాలా అనుకున్నాను. కానీ ఏదీ జరగలేదు. ఒకప్పుడైతే తనకు నేను గుర్తున్నాను.. ఇప్పుడు గుర్తున్నానో లేదో తెలియదు. రేయ్ ఒక్కసారి కలవరా” అంటూ మాట్లాడింది ప్రేరణ.

ఇవి కూడా చదవండి : 

Shilpa Shetty : శిల్పా శెట్టి చెల్లెలు తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఎవరంటే..

Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..