AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay: సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా.. సంచలన ఆరోపణలు చేసిన నటి

మొన్నటివరకు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణించిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీయే ఎన్నికల్లో విజయ్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. దాంతో ఇప్పుడు విజయ్ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

CM Vijay: సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా.. సంచలన ఆరోపణలు చేసిన నటి
Cm Vijay
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2026 | 4:36 PM

Share

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి ప్రజలకు సేవ చేస్తున్నా విషయం తెలిసిందే.. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలలో విజయ్ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. టాప్ హీరోగా రాణించిన విజయ్ ఇటీవలే అఫీషియల్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే కాదు తొలి ఎన్నికల్లోనే రికార్డ్ స్థాయిలో విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు విజయ్. ఏకంగా 108స్థానాల్లో విజయం సాధించి తమిళ నాడులో టీవీకే జెండా పాతారు విజయ్. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజీయాలపైనే దృష్టి పెట్టనున్నారు సీఎం విజయ్. ఇదిలా ఉంటే విజయ్ పై ఓ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకూ ఆ నటి ఎవరు.? విజయ్ పై ఆమె చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం .!

సీఎం విజయ్ కారణంగా తన కడుపులో శిశువు చనిపోయిందని సంచలన ఆరోపణలు చేసింది బుల్లి తెర నటి జూలీ..  ఈ నటి ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ను వెతిరేకిస్తూ ప్రచారం చేసింది. అంతే కాదు అప్పుడు అనుమతిలేకపోయిన చెన్నై బీచ్ లో విజయ్ కు వెతిరేకంగా నిరసన చేసి వివాదం లో చుక్కుకుంది. దాంతో విజయ్ అభిమానులు, తమిళ వెట్రి కళగం ఓ రేంజ్ లో ఆమె పై ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె పై విమర్శలు, ట్రోల్స్ తో రెచ్చిపోయారు.

తాజాగా జూలీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నాపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ మితిమీరడంతో నేను తట్టుకోలేక కొందరి పేర్లతో సహా మార్చిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను.. కానీ అప్పుడు ఎన్నికలు అవ్వడంతో దానిని పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడు తిరిగి నాపైనే ఆరోపణలు చేస్తున్నారు. రూ.15 లక్షల కిడ్నీ స్కామ్‌ ఆరోపణలు చేస్తున్నారు. నన్ను ఎదో ఒక కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఈ ట్రోల్స్ కారణంగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. మానసికంగా ప్రశాంతత లేకుండా పోయింది. ఈ ట్రోల్స్ కారణంగా నేను నా కడుపులో బిడ్డను కోల్పోయా.. దానికి కారణం విజయ్ అన్నయ్యే.. ప్రతక్షంగా కాకపోయినా పరోక్షంగా విజయ్ హస్తం ఉంది.. నాపై ట్రోల్ చేసేవారిని ఒక్క మాట చెప్పి మీరు కంట్రోల్ చేసి ఉంటే నేను నా బిడ్డను పోగొట్టుకునేదాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చింది. జూలీ మాటలపై నటి అంబిక స్పందిస్తూ.. నీ బిడ్డను కోల్పోయినందుకు నేను చింతిస్తున్నా.. కానీ నువ్వు మాట్లాడేదానికి అర్ధంలేదు.. నీ ప్రగ్నెన్సీ విషయంలో జరిగినదానికి సీఎం విజయ్ ఎలా కారణం అవుతాడు. ముందు నీ మాట తీరు మార్చుకో అంటూ ఇచ్చిపడేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా..
సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా..
చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్..
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్..
ఇకపై మెగా లీగ్‌లో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
ఇకపై మెగా లీగ్‌లో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
బ్రష్ చేయగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మీకుందా..?
బ్రష్ చేయగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మీకుందా..?
ఇలా కూడా ప్రొటెస్ట్ చేస్తారా? బ్యాంక్‌ ముందే వంటలు.. అక్కడే భోజనం
ఇలా కూడా ప్రొటెస్ట్ చేస్తారా? బ్యాంక్‌ ముందే వంటలు.. అక్కడే భోజనం